అనేక వాయిదాల తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఓవరాల్ కలెక్షన్స్ పై మాత్రం ఐపీఎల్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల అవుతుండగా మార్చి 26న ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది.
ఈసారి,ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. అంతేకాకుండా, మొదటి రెండు రోజులు మూడేసి మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ ఎఫెక్ట్ ఆర్ ఆర్ ఆర్ ఈవినింగ్, నైట్ షోలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కానీ ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే… రాజమౌళి గత చిత్రం బాహుబలి 2 కూడా ఐపీఎల్ సమయంలో విడుదలైంది. కానీ ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. మరి ఆర్ ఆర్ ఆర్ కూడా అదే ఫీట్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.