కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ సీజన్-14 వచ్చే నెలలో ప్రారంభం కానుంది. యూఏఈలో మిగిలిపోయిన మ్యాచ్ లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ఛానల్.
చెన్నై జట్టు కెప్టెన్ ధోనీతో తీసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వెరైటీ గెటప్ లో కనిపించిన ధోనీ.. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ వస్తుంది.. తుపానులా ఉంటుందంటూ చెప్పిన డైలాగులు అదిరిపోయాయి.
ఈ సీజన్ లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ లను ఫస్టాఫ్ గా… ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లు క్లైమాక్స్ గా చూపిస్తూ వీడియోను రూపొందించారు. క్రికెట్ అభిమానులు దీనికి లైకుల వర్షం కురిపిస్తున్నారు.