అన్ని రంగాల్లాగే కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్ ను వదలటం లేదు. ఇప్పటికే టైటిల్ స్పాన్సర్ అంశంలో బోర్డు ఆదాయం సగానికి పడిపోగా, ఇతర రంగాల నుండి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లు ఆడాల్సి వస్తుండటంతో ఆదాయం గణనీయంగా పడిపోవటంతో ఐపీఎల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఐపీఎల్ ను దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల్లో క్రికెట్ పండుగ మొదలుకానుంది. అయితే, గేమ్ మొదలయ్యే ముందు జట్లకు షాకిస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ విన్నింగ్ ప్రైజ్ మనీలో భారీగా కోత విధించింది. దాదాపు సగం మనీని తగ్గించేసింది.
ఐపీఎల్ గెలిచిన జట్టుకు 20కోట్ల ప్రైజ్ మనీ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఆ ప్రైజ్ మనీని 10కోట్లకు తగ్గించేసింది. రన్నరప్ గా నిలిచిన జట్టుకు గతంలో 12.5కోట్లు ఇవ్వగా ఇప్పుడు 6.25కోట్లు, క్వాలిఫైయర్ రౌండ్స్ లోనే ఇంటిబాట పట్టే జట్లకు 4.37కోట్లు ఉంటుందని తెలిపింది.
ఈ నిర్ణయం ఫ్రాంచైజీలపై ఏమాత్రం పడదని… వారికి స్పాన్సర్ షిప్స్ రూపంలో వచ్చే ఆదాయం యాధావిధిగానే ఉంటుందని బీసీసీఐ తెలిపింది.