ఐపీఎల్ బ్యూటీ కావ్య మారన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కావ్య మారన్ ఐపీఎల్ లో ఈ పేరుకు ఉండే క్రేజే వేరు. ఆమె అందానికి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఐపీఎల్ వేలం సహా తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్ లలో సందడి చేస్తూ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈ బ్యూటీ మ్యాచ్ లో సందడి చేస్తే చాలు.. ఆ రోజు నెట్టింట అంతా ఆమె ఫొటోలతో నిండిపోవాల్సిందే. అంత క్రేజ్ ఉంది కావ్య మారన్ సొంతం.
తాజాగా ఆమెకు ఓ అభిమాని మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. ఓ మ్యాచ్ జరిగేటప్పుడు ప్లకార్డు పట్టుకుని గ్రౌండ్ లో తిరిగాడు. దీనికి నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
‘కావ్య మారన్ విల్ యూ మ్యారీ మీ’ అంటూ బోర్డు పై రాసి పట్టుకుని ఉన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు, ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. మరి దీనిపై కావ్య మారన్ ఎలా రియాక్ట్ కానుందో చూడాలి.
Kaviya Maran is now famous in South Africa too
— Gappa Cricket (@GappaCricket) January 19, 2023