క్రికెట్ పండుగ ఐపీఎల్ 2021కు ముహుర్తం దగ్గరపడుతుంది. దేశంలో కరోనా పరిస్థితులు చక్కపడుతున్న నేపథ్యంలో మార్చి నెలాఖరు నుండి ఇండియాలోనే ఐపీఎల్ 2021 సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆటగాళ్ల వేలం ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది.
ప్రతి ఏడాదిలాగే అన్ని జట్లు కొంతమందిని అంటిపెట్టుకోగా… మరికొందరు ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. గతేడాది ప్రభావం చూపని ఆటగాళ్లను అన్ని జట్లు వదలించుకున్నాయి.
టీంలు వదిలిచ్చుకున్న ఆటగాళ్లు వీరే….
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-
ఉమేష్ యాదవ్, మెయిన్ అలీ, క్రిస్ మోరిస్, ఫించ్, ఉదాన, గుర్ క్రీత్ మాన్, స్టెయిన్, పవన్ నేగీ, శివమ్ దూబె, రిటైర్ అయిన పార్థీవ్ పటేల్.
వీరిని రిలీజ్ చేయటం వల్ల బెంగళూరు వచ్చే ఐపీఎల్ వేలంలో 35.7కోట్లు ఖర్చు చేసి కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం దక్కించుకుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్-
స్టాన్ లేక్, ఫాబియన్, సంజయ్, సందీప్, యర్రా పృథ్వీరాజ్
మిగిలిన డబ్బు- 10.75కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్-
మురళీ విజయ్, కేదార్ జాదవ్, హార్భజన్ సింగ్, పియూష్ చావ్లా, మెనూ సింగ్, రిటైన్ అయిన వాట్సన్
మిగిలిన డబ్బు- 22.9కోట్లు
ఢిల్లీ డేర్ డెవిల్స్-
జేసన్ రాయ్, మోహిత్ శర్మ, తుషార్, కీమో పాల్, లామి చానె, అలెక్స్ క్యారీ
మిగిలిన డబ్బు- 12.8కోట్లు
పంజాబ్ కింగ్స్ ఎలెవన్-
మ్యాక్స్ వెల్, క్యాట్రెల్, గౌతమ్, ముజిబర్, నీషమ్, హార్డస్, కరుణ్ నాయర్, జితేందర్, సుచిత్
మిగిలిన డబ్బు- 53.2కోట్లు
రాజస్థాన్ రాయల్స్-
స్టీవ్ స్మిత్, రాజ్ పుత్, ఓషేన్ థామస్, ఆకాష్, ఆరోన్, కర్రాన్, అనిరుధ్, శశాంక్
మిగిలిన డబ్బు- 34.85కోట్లు
ముంబై ఇండియన్స్-
మలింగ, కల్టర్ నైల్, ప్యాటిన్సన్, రూథర్ ఫర్డ్, మెక్లేన్ గన్, దిగ్విజయ్, బల్వంత్ రాయ్
మిగిలిన డబ్బు- 15.35కోట్లు
కోల్ కతా నైట్ రైడర్స్-
నిఖిల్ నాయక్, సిద్దేడ్ లాడ్, బాంటమ్, సిద్ధార్థ్, క్రిస్ గీర్న్, హ్యారీ గుర్నే
మిగిలిన డబ్బు- 10.85కోట్లు