తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు సజ్జనార్. హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా ఉన్న ఆయన్ను ఇటీవలే ఆర్టీసీకి బదిలీ చేసింది ప్రభుత్వం.
సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో కూడా పని చేశారు. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టడంతో ఉద్యోగులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.