అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై భారీ రివార్డు ప్రకటించింది ఇరాన్. ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసీంను అమెరికా మట్టుపెట్టడంపై రగిలిపోతున్న ఇరాన్… అమెరికాపై పగ తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే ఏకంగా అమెరికా అధ్యక్షుడి తలపై భారీ రివార్డ్ ప్రకటించటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఇరాన్, అమెరికాల దూకుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు పెరిగిపోయాయి.