ఒకప్పుడు ట్రైన్ టికెట్ తీసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్లి వెయిట్ చేయాల్సిందే. గంటల తరబడి టికెట్ కోసం లైన్లో నిలబడాల్సిందే. కొన్నిసార్లు లైన్లో నిలబడిన తరువాత కూడా టికెట్ దొరుకుతుందా అంటే చెప్పలేం. కొన్నిసార్లు టికెట్ దొరక్కపోవచ్చు. దాంతో వెనకకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో అన్ని టికెట్లను మనమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. దాని కోసం రకరకాల యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ఐఆర్సిటిసి…. ఈ యాప్ ద్వారా ట్రైన్ టికెట్ తో పాటు బస్ టికెట్లు, విమాన టికెట్లు, హోటల్ లు బుక్ చేసుకోవచ్చు.
అలాగే టూర్ ప్యాకేజీ అంతేకాకుండా రీఛార్జ్ లు కూడా చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ యాప్ లో ఏజెంట్ గా పని చేసి నెలకు 80వేల వరకు సంపాదించే అవకాశం కల్పించింది. ఐఆర్సిటిసి లో ఏజెంట్ గా సంవత్సరానికి రూ. 3999 చెల్లిస్తే ఏజెంట్ గా పని చేయవచ్చు. అయితే ఏడు వేలు చెల్లిస్తే రెండేళ్లు ఏజెంట్ గా పనిచేయవచ్చు. ఇక ఈ యాప్ ద్వారా బుక్ చేసే ట్రైన్ టికెట్ లపై ఏజెంట్ లకు కమిషన్ ఇస్తుంది.
Advertisements
నాన్ ఏసి టికెట్ బుక్ చేస్తే 20 రూపాయలు, ఏసి టికెట్ బుక్ చేస్తే 40 రూపాయలు ఇస్తుంది. అంతే కాకుండా 2000 లావాదేవీలకు 0.75% కమిషన్ వస్తుంది. నెలకు ఎన్ని టిక్కెట్లు అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఏజెంట్లుగా పని చేసే వారికి ఉపాధి ఏర్పడుతుంది. అంతేకాకుండా టికెట్ బుకింగ్ విధానం కూడా చాలా సులభతరం అవుతుంది.