అతి త్వరలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. అందరూ ఈ డిసెంబర్ 31ను స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనే అనుకుంటారు. కొందరు గోవా, కశ్మీర్, సిమ్లా ప్లాన్ చేసుకుంటారు. కాస్త డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అనుకునే వారు బ్యాంకాక్ ట్రిప్‌కు రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు బ్యాంకాక్ ట్రిప్ కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్స్‌ను ప్రకటించింది.
ట్రెజర్‌స్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ పేరుతో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ఇస్తోంది. బ్యాంకాక్, పటాయాలో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. 5 రోజులు-4 రాత్రుల బ్యాంకాక్‌లో గడపవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా… ఫ్లైట్ టికెట్స్, వీసా చార్జీలు కలిపి 5 బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్స్‌తో పాటు డిసెంబర్ 31 నైట్ గాలా డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, గెస్ట్‌హౌజ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం ఒక్కోక్కరికి 47,990రూపాయలను చార్జ్ చేస్తున్నారు.
ఈ స్పెషల్ ఇయర్ ఎండింగ్ టూర్ డిసెంబర్ 29న ముంబై నుండి ప్రారంభమైతుంది. ఎర్లీ మార్నింగ్ 2.40బ్యాంకాక్ ఫైట్‌తో స్టార్టయ్యే జర్నీ… జనవరి 3 ఎర్లీ మార్నింగ్ మళ్లీ ముంబాయికి చేరుకుంటారు. ఫస్ట్ డే బ్యాంకాక్ టూర్, గోల్డెన్ బుద్ధ, మార్బుల్ టెంపుల్ దర్శనం ఉంటాయి. సాయంత్రం ఛావో ఫ్రాయా రివర్ క్రూజ్‌లో విహారం ఉంటుంది. నైట్‌కి బ్యాంకాక్‌లోనే బస ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 30న సఫారి వాల్డ్, మెరైన్ పార్క్, ఇందిరా మార్కెట్ ఉంటుంది.
ఇక డిసెంబర్ 31న న్యూఇయర్ సెలబ్రెషన్స్ స్టార్ట్ అవుతాయి. టైగర్ షోతో మొదలయ్యే స్పెషల్ డే… పటాయాలో గాలా డిన్నర్ ఉంటుంది. అక్కడే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ రోజు పటాయాలోనే బస ఉంటుంది. మరుసటి రోజు అంటే జనవరి 1న ఐల్యాండ్ టూర్, అల్కజార్ షో ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ జర్నీలో జెమ్స్ గ్యాలరీతో పాటు ఇందిరా మార్కెట్‌లో షాపింగ్‌తో బ్యాంకాక్ టూర్ ముగుస్తుంది.
బంగారం కొనండి…కిలో ఉల్లి గెలుచుకోండి