శబరిమల దర్శనానికి వెళ్లాలి అనుకునే వారికి రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల కోసం ప్రత్యేకంగా ఓ ప్యాకేజ్‌ను రూపోందించింది. అతి తక్కువ ధరల్లోనే వెళ్లివచ్చేలా ప్యాకేజ్ ఏర్పాటు చేశామని ప్రకటించింది ఇండియన్ రైల్వే.
కేవలం 2990 రూపాయల ఈ ప్యాకేజ్ చైన్నై నుండి మొదలుకాబోతుంది. ప్రతీ గురువారం, శుక్రవారాల్లో ఈ టూర్ ఉంటుంది. చెన్నై నుండి కొట్టాయం మీదుగా శబరికి చేరుకుంటారు. క మొత్తం 3 డేస్, 2 నైట్స్ ఉండగా… ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుండి ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు. ఏసీ రైలు ప్రయాణం, టికెట్స్ ప్యాకేజ్‌లో ఉన్నాయి.
గురు,శుక్రవారాల్లో మొదలయ్యే ఈ టూర్ మధ్యాహ్నం 3.20గంటలకు మొదలవుతుంది. కాబట్టి ఎవరైనా ఈ ప్యాకేజ్‌లో వెళ్లాలి అనుకుంటే మద్యాహ్నం కల్లా చెన్నై చేరాల్సి ఉంటుంది. రెండో రోజు తెల్లవారుజామున 4.17గంటలకు కొట్టాయం చేరుకుంటారు. అక్కడ నుండి పంబకు బయల్దేరాలి. నీలక్కల్ నుండి బస్సు ప్రయాణం ఉంటుంది. కానీ సొంత ఖర్చుతోనే ప్రయాణించాల్సి ఉంటుంది. సాయంత్రం 4గంటల వరకు పంబకు చేరుకుంటారు. అక్కడి నుండి శబరిమలకు వెళ్లాల్సి ఉంటుంది. శబరిలో సొంత ఖర్చులతోనే బస ఏర్పాట్లు చేసుకోవాలి. మూడో రోజున ఉదయం 3గంటలకు అభిషేకంలో పాల్గొని, 7గంటలకు పంబకు రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడి నుండి నీలక్కల్ చేరుకోవాలి. సాయంత్రం 6.30కల్లా రైల్వే స్టేషన్‌కు చేరుకోగా… కొట్టాయం నుండి నైట్ 8.30ట్రైన్‌కు చెన్నై బయలు దేరాల్సి ఉంటుంది. ఇలా యాత్ర ఉదయం 10గంటలకు ముగుస్తుంది.