భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. భారత్ గౌరవ్ రైలుకు ఐఆర్‌సీటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 21న భారత్ గౌరవ్ తొలి రైలు ప్రారంభం కానున్నట్టు వెల్లడించింది. శ్రీ రాముడితో సంబంధం ఉన్న నేపాల్ లోని ప్రదేశాల్లో ఈ రైలు ద్వారా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఐఆర్‌సీటీసీ ప్రకటన ప్రకారం…
ఈ రైలు ఢిల్లీలో ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. దేశంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాల గుండా రైలు ప్రయాణిస్తుంది.
వయా అయోధ్య, బుక్సార్, సితామర్హిల గుండా వెళుతూ నేపాల్ లోని జానక్ పూర్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వారణాసి, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం గుండా ప్రయాణించి ఢిల్లీ చేరుకుంటుంది.
మొత్తం 18 రోజుల పాటు ప్రయాణం సాగనుంది. రైలు ముఖ్యంగా నేపాల్ లోని ధనూష కొండలు, భవన్ బిఘా ఏరియా, సీతాదేవీ జన్మస్థలంలో నిర్మించిన ఆలయం, శ్రీరాముడి వివాహం జరిగిన ప్రదేశం లాంటి ప్రముఖ ప్రాంతాల గుండా వెళుతుంది. 600 సీట్లు కల ఈ ట్రైన్ లో ఒక్కో యాత్రికుడికి రూ. 65000 వరకు చార్జ్ చేయనున్నట్టు సమాచారం.