మాజీ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ తమిళ్ లో తన డెబ్యూ మూవీతో సినీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేస్తున్న కోబ్రా అనే సినిమాలో ఫ్రెంచ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటించాడు ఇర్ఫాన్. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ సమ్మర్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. గత మార్చ్ లో రష్యాలో షూటింగ్ కోసం వెళ్లిన ఈ చిత్ర యూనిట్ ప్యాండమిక్ కారణంగా తమ షూటింగ్ కు ప్యాకప్ చెప్పి ఇండియా వచ్చేసింది. ఈ సినిమాలో విక్రమ్ దాదాపు 20 డిఫరెంట్ గెటప్ లలో కనిపించబోతున్నాడని సమాచారం! చూడాలి …. క్రికెట్ లో అర్థాంతరంగా కెరీర్ ను ముగించిన ఇర్ఫాన్ కు సినీ ఇండస్ట్రీ ఏమేరకు కలిసివస్తుందో!
Watch Teaser :