తమిళ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న విజయ్ ఇళయ దళపతిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుత రాజకీయాలను టార్గెట్ చేసుకొని… విజయ్ తన సినిమాల్లో వేసే పంచ్‌లు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే… ఇటీవల విజయ్ పై జరిగిన ఐటీ రైడ్స్ బీజేపీ కక్షసాధింపు అన్న విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భంలో విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న వార్త సంచలనం సృష్టిస్తోంది.
విజయ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని, అది అడ్డుకునేందుకే… ఆయనపై ఐటీ దాడులని దర్శకుడు అమీర్ ప్రకటించారు. కానీ ఇలాంటి ఒత్తిడి వల్ల ఆయన మరింత అభివృద్ది చెందుతారే కానీ వెనుకడుగ వేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. విజయ్ నటిస్తోన్న మాస్టర్ సినిమాకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టడం, విజయ్‌కు మద్దతుగా తన అభిమానులు రావటంతో పోలీసులు లాఠీచార్జి చేయటం దుర్మార్గమని విమర్శించారు.
దీంతో.. .విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లేనని తమిళనాడులో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రజినీకాంత్, కమలహసన్‌లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో… విజయ్ అడుగులు కీలకంగా మారాయి.