క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ ని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఈ అమ్మడు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఓ టిక్ టాక్ వీడియోలో మెడలో తాళిబొట్టుతో, నుదుటన సింధూరంతో శ్రీరెడ్డి కనిపించింది.
అయితే గతంలో కూడా తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, రాజకీయ నేతకు భార్యగా ఉండేందుకు ఇష్టపడతానని ఓ ఇంటర్వ్యూలో సైతం చెప్పుకొచ్చింది. మరో వైపు శ్రీరెడ్డి వివాహంపై మరి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి… ఓ యువ డైరక్టర్ ను పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనకు పెళ్లి కాలేదని ఇదంతా టిక్ టాక్ కోసమే అంటూ శ్రీరెడ్డి క్యాప్షన్ పెట్టింది.