పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అగ్ర హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఆయన బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో బాలీవుడ్ లో కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి. ఈ సినిమాతో సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళాడు. అయితే ఈ సినిమా గురించి నాగబాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. గంగోత్రి సినిమాలో హీరోగా నటించడానికి మొదట రామ్ చరణ్‌కు ఆఫర్ వచ్చిందని, అయితే చిరంజీవి వల్ల అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లోకి వచ్చాడని అన్నారు.
రామ్ చరణ్ కి గంగోత్రి సినిమా హీరోగా ఆఫర్ వచ్చినప్పుడు చరణ్ హీరోగా అరంగేట్రం చేయడానికి అప్పటికీ చాలా చిన్నవాడని చిరంజీవి భావించినట్టు ఆయన తెలిపారు. దీంతో చిరంజీవి ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ను రిఫర్ చేశాడని అన్నారు. గంగోత్రి సినిమా అవకాశం వచ్చినప్పుడు చరణ్ కి సినిమాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే చిరంజీవి అలా చేశారని ఆయన పేర్కొన్నారు.