అనుపమ పరమేశ్వరన్…త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన బ్యూటీ. ‘అ ఆ’ ‘శతమానంభవతి’ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది అనుపమ. కెరీర్ మొదటి నుంచి నెమ్మదిగా వచ్చిన అవకాశాలను చేసుకుంటూ కెరీర్ నెట్టుకొచ్చింది. ఒకటో రెండో మంచి హిట్ లు ఉన్నప్పటికీ పెద్ద సినిమాల్లో మాత్రం అవకాశాలు రాలేదు. ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, లవ్ యు తేజ్, హలో గురు ప్రేమకోసమే సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లాపడటంతో అనుపమ కెరీర్ కు పులిస్టాప్ పడినట్టు కనిపించింది.
బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ కొట్టినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో అనుపమకు అవకాశాలు రాలేదు. ప్రస్తుతం దిల్ రాజు సమీప బందువు హీరో గా వస్తున్న సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ ఒక్క సినిమా తప్ప అనుపమ చేతిలో చెప్పుకోటానికి పెద్దగా సినిమాలు లేవు. దీనిబట్టి చూస్తుంటే అనుపమ కెరీర్ ఇక టాలీవుడ్ లో ముగిసినట్టే కనిపిస్తుందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Advertisements