అందం, అభినయం కలిస్తే అనుష్క శెట్టి. ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన బాడీ స్ట్రక్చర్ తో యూత్ ని తనవైపు తిప్పుకుంది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది అనుష్క. ‘నిశ్శబ్దం’ చిత్రం తర్వాత ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో నటిస్తోంది. చాలా రోజుల తర్వాత స్వీటీ ఈ మూవీలో నటిస్తుండటంతో దీనిపై ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అనుష్క బొద్దుగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
‘సైజ్ జీరో’ సినిమా కోసం బొద్దుగా తయారైన స్వీటీ.. మళ్లీ అప్పటి నుంచి నార్మల్ గా కాలేకపోతుంది. అమెరికాలో కూడా వెయిల్ లాస్ అయ్యేందుకు ట్రై చేసింది. కానీ అది కూడా అనుష్కకి ఎలాంటి రిజల్ట్స్ ని ఇవ్వలేదు. ఈ మధ్య శివరాత్రి పండుగ సందర్భంగా స్వీటీ లుక్స్ వైరల్ అయ్యాయి. ఆమెను చూసిన ఫ్యాక్స్ షాక్ అయ్యారు.
అనుష్క అలా బొద్దుగా అవడానికి అనారోగ్య సమస్యే కారణమని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బరువు తగ్గడానికి అనుష్క ఎన్ని ప్రయత్నాలు చేసినా థైరాయిడ్ సమస్య వల్ల తగ్గలేకపోతున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం అనుష్కనే తేల్చాలి. అనుష్క బొద్దుగా మారటంపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అనుష్కకి సినిమాల్లో నటించే ఆలోచనే లేదని.. అందుకే ఫిట్ నెస్ ని పట్టించుకోవడం లేదంటూ డిస్కర్షన్ చేస్తున్నారు. ఏదిఏమైనా అనుష్క లావుగా కనిపించడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వీటీ మళ్లీ నార్మల్ లుక్ లోకి రావాలని ఆశిస్తున్నారు.