కరోనా వైరస్ మన దేశంలో అడుగు పెట్టిన తర్వాత రోజు కోడి గుడ్లు ఎక్కువగా తినాలని వైద్యులు చెప్తున్నారు. కరోనా వచ్చినా రాకపోయినా సరే ప్రోటీన్ లు ఎక్కువగా ఉండే కోడి గుడ్లను తింటే ఆరోగ్యానికి మంచితో పాటు కరోనాతో పోరాడే శక్తి మనకు లభిస్తుంది అంటారు. సరే ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ లో బ్రౌన్ గుడ్లకు, తెలుపు గుడ్లకు మధ్య కాస్త పోటీ ఉంది. అసలు ఈ రెండు రంగుల గుడ్ల మధ్య తేడా ఏమిటి?
Also Read:ఈఫిల్ టవర్ ను ఫోటో తీస్తే జైలుకేనా…?
బ్రౌన్ రంగులోనివి తెల్ల గుడ్లకన్నా మంచివి, ఏ మందులు లేకుండా పెంచుతారు కోళ్ళను అనే ప్రచారం ఉంది. తరచుగా, గోధుమ గుడ్లను అమ్మే వ్యక్తులతో పాటుగా వాటిని ఇష్టపడే వ్యక్తులు తెల్ల గుడ్ల కన్నా గోధుమ గుడ్లు సహజమైనవి మరియు ఆరోగ్యకరమైనవి అని చెప్తూ, మార్కెటింగ్ చేస్తారు సైలెంట్ గా. ఆ విధమైన అసత్య ప్రచారంతోనే వాటిని ధర పెంచి అమ్మడం జరుగుతోంది అనే ఆరోపణ ఉంది.
వాస్తవంగా మాట్లాడాలి అంటే… గోధుమ రంగు గుడ్డు అయినా, తెల్ల గుడ్డు అయినా సరే అది గుడ్డు అనే విషయం మర్చిపోవద్దు. రంగులో, ధరలో తేడా మినహా రుచి మరియు పోషణ విషయానికి వస్తే, తెలుపు మరియు గోధుమ గుడ్ల మధ్య తేడా ఏమీ ఉండదు. గోధుమ రంగు గుడ్డు మన దేశంలో నాటు కోళ్ళు మాత్రమే పెడతాయి. మార్కెట్ లో దొరికేవి నాటుకోడి గుడ్లు అనే బ్యాచ్ కూడా ఉంది. అవి కేవలం దిగుమతి చేసుకున్న గుడ్లు మాత్రమే అంటున్నారు నిపుణులు. తెలుపు రంగు ఇష్టం లేని వాళ్ళు ఫ్రిడ్జ్ లో అందంగా ఉండటానికి గోధుమ రంగులోవి కొనుక్కుంటారు.
Also Read:పవన్ కళ్యాణ్ కి బదులుగా “హరీష్ శంకర్” గబ్బర్ సింగ్ లో నటించిన సీన్స్ ఏవో తెలుసా ?