పుష్పతో పెద్ద హిట్ కొట్టిన అల్లు అర్జున్, ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే పుష్ప-2 స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ పై ఊహించని విధంగా ఓ ప్రచారం మొదలైంది. అదేంటంటే.. బన్నీ జాతకం బాగాలేదంట. రాబోయే రోజుల్లో ఆయనకు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయంట. ఇదీ ఆ ప్రచారం సారాంశం.
ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం.. రీసెంట్ గా బన్నీ జాతకాన్ని ఓ పెద్ద సిద్ధాంతికి చూపించారు. అసలు అలా ఎందుకు చూపించాల్సి వచ్చిందనే విషయాన్ని పక్కనపెడితే, సదరు సిద్ధాంతి మాత్రం బన్నీ జాతకం చూసి కొన్ని దోషాలు ఉన్నాయని చెప్పారట. వాటి పరిహారం కోసం ఇంట్లో కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారట.
దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంట్లో, ఆ పూజల కోసం ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పూజలు, జాతక దోషాలు పోగొట్టే ప్రక్రియలు పూర్తయిన తర్వాత మాత్రమే పుష్ప-2ను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడట అల్లు అర్జున్.
ప్రస్తుతం బన్నీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. అల వైకుంఠపురములో సినిమాతో ఇఁడస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ.. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాలీవుడ్ లో ఆ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరై, బన్నీకి అఖండ ఖ్యాతిని తీసుకొచ్చింది. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో కూడా అల్లు అర్జున్ పాపులర్ అయ్యాడు. ఇలా కెరీర్ లో, జీవితంలో మంచి పొజిషన్ లో ఉన్న టైమ్ లో బన్నీ జాతకాన్ని ఎందుకు చూపించాల్సి వచ్చింది, ఆ జాతకంలో దోషాలు ఎందుకు కనిపించాయనేది పెద్ద ప్రశ్న. బన్నీ మాత్రం దోష నివారణ పూజల వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.