వాసిరెడ్డి అమర్నాథ్
మీడియా ప్రచారం అనండి లేదా దాన్ని జనాలు అర్థం చేసుకోవడం లో లోపం అనండి , కరోనా సోకితే ఇక మరణమే అని జనాలు నమ్ముతున్నారు । { అన్నట్టు కరోనా మరణాలు లెక్కకట్టడం లో తప్పుడు విధానం అంటూ నేను గత యాభై రోజులుగా పోరాటం చేస్తున్నా। మొత్తం ఎంత మందికి సోకితే ఎన్ని మరణాలు అని లెక్క కట్టితే ఇది 0.2 % కంటే తక్కువగా ఉంటుంది అని నేను చెబుతున్నా। అంటే రెండువేలమందికి సోకితే ఒకరో ఇద్దరో మరణం । ఇన్ని రోజులు నా పాయింట్ ను ఎవరూ పట్టించుకోలేదు । ఇప్పడు ICMR సభ్యుడు ఈ విధానం సరి కాదని చెప్పడం జరిగింది . ఆ ఇంటర్వ్యూ ఇందాకే నా టైం లైన్ లో పోస్ట్ చేశాను ।. చూడగలరు . ఆయన ఒక శాతం మరణాలు అంటున్నారు . అది కూడా ఎక్కువే. సరిగ్గా లెక్కిస్తే నేను చెప్పిన లెక్కలు టాలీ అవుతాయి. కనీసం లెక్కకట్టడం తప్పు అని ఒప్పుకున్నందుకు థాంక్స్ } .
కరోనా అంటే మరణమే అని జనాలు ఫిక్స్ అయిపోయిన నేపధ్యం లో ఫలానా చోట సోకింది … ముగ్గురు కరోనా బారిన పడ్డారు అంటూ ఒక టీవీ ఛానల్ లో బ్రేకింగ్ ! ఛానల్ మారిస్తే మరో దానిలో అదే బ్రేకింగ్ ! ఇంతలో వాట్సాప్ గ్రూప్ లో అదే వార్త ! మరో గ్రూప్ లో అదే వార్త ! టీవీ ఛానల్ మారిస్తే మరో దానిలో భయపెట్టే మ్యూజిక్ … డాంగ్ … డాంగ్ … డాంగ్ అంటూ అదే వార్త ! సరే టీవీ ఆఫ్ చేసి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అదే వార్త ! అదే వార్త ఒక గంట లో పది సార్లు … దాని ఇంపాక్ట్ పది సార్లు మైండ్ పై ! ఇక రోజూ ఇలా సోకిన వారి వార్తలు ఉంటూనే ఉంటాయి ! ఇన్నన్ని సార్లు ఇన్నన్ని కరోనా వార్త్లు లైవ్ మ్యూజిక్ తో విని తట్టుకోవడం మామూలు వాడికి సాధ్య పడదు ।!
మీడియా పెద్దలైనా ఒక సారి కూర్చొని ఆలోచించాలి ! కరోనా సోకడం అనే దాన్ని అన్నన్ని సార్లు బ్రేకింగ్ న్యూస్ పేరుతొ అంత భయపెట్టే మ్యూజిక్ తో ఇవ్వడం వల్ల ఏమైనా మంచి జరుగుతోందా అని ఆలోచించాలి ! ప్రభుత్వమైనా దీని గురించి అలోచించి కొన్ని మార్గదర్శకత్వాలు రూపొందించాలి !
కరోనా సోకడం అంటే మరణం కాదు ! మరణాలన్నీ భయపెట్టే వార్తలు కావు ! 70 దాటిన వ్యక్తి , రకరకాల జబ్బుల తో బాధ పడుతున్న వ్యక్తి మరణం- బాధ కరమే! అలాంటి వారిని రక్షించుకొనేందుకు ప్రయతించాలి ! కానీ అలాంటి మరణాలను మామూలు మరణాల్లో తోసేసి జనాల్ని బయపెట్ట కుండా … మొత్తం మరణాలు ఎన్ని? అందులో బాగా వృద్ధాప్యం వల్ల జరిగిన మరణాలు ఎన్ని ? ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతూ కరోనా వల్ల మరణించిన వారు ఎంత మంది ? ఆరోగ్యంగా ఉంటూ కూడా కరోనా సోకడం వల్ల ఎవరైనా మరణించారా ? ఇలాంటి డేటా ఇవ్వకుండా ఇంత మందికి సోకింది … ఆమ్మో … అయ్యో అనే వార్తలు పదే పదే చూస్తే/ వింటే కరోనా సోకకుండానే జనాలు భయం తోనే పోతారు ।
ఫేస్బుక్ మిత్రులారా ! ఏది మరణం ? మన ఇమ్మ్యూనిటి పవర్ కన్నా కరోనా శక్తి గొప్పది అనుకోవడం మరణం ! కరోనా ను తెలివిగా ఎదురుకోవడం కన్నా రోజూ దాని గురించి భయపడుతూ వణికి పోవడం మరణం ! ఆ మరణాన్ని జయించడానికి నేను వెళుతున్నాను । కరోనా వల్ల ప్రమాదం మనం భయపడిన స్థాయిలో లేదని చెప్పడానికి వెళుతున్నాను । నాతో వచ్చేదెవరు ? ఆ మరణాన్ని దాటి నాతో బతికేదెవరు ? జై భారత మాత !