క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. పెళ్లిచూపులు సినిమాతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కానీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మాత్రం విజయ్ కెరీర్ ఆధారపడి ఉందని సినిమా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం విజయ్ మార్కెట్ పడిపోయే ప్రమాదం ఉందని అనుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ కూడా అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ కథలనే ఎంచుకుంటున్నాడు. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇలాంటి కథలనే విజయ్ తెస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. విజయ్ లానే మొదట్లో రాజ్ తరుణ్ కూడా అంతే వేగం తో వచ్చి ఇప్పడు హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. దేవరకొండకి కూడా ఇలాంటి ఇబ్బంది రాకముందే ప్రేక్షకులను మెప్పించే విదంగా కథలు చూసుకుంటే మంచిదని సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విజయ్ ను ఎంతమేర నిలబెడుతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.