శర్వానంద్ సమంత జంటగా వస్తున్న సినిమా జాను. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన 96 సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మాములుగా దిల్ రాజు ఏదైనా సినిమాను నిర్మిస్తున్నడంటే ఆ సినిమా రిలీజ్ కు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాడు. అన్ని విధాలా సినిమాను ప్రమోషన్ చెయ్యటంలో ముందుంటాడు.
కానీ జాను విషయంలో అంత ఆసక్తి చూపినట్టు కనిపించట్లేదు. సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం దిల్ రాజులో మొదటి నుంచి లేదని ఫిలింనగర్ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి. ఈ సినిమా రీమేక్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేని దిల్ రాజు తన కూతురు చెయ్యమనటంతో ఒప్పుకున్నాడని సమాచారం. సినిమా హిట్ అవ్వదని ఆలోచనలో ఉన్న దిల్ రాజు అందుకే ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి దిల్ రాజు అనుకున్నట్టు జరుగుతుందా లేకా జాను సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.