సినిమా దర్శకత్వం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమా దర్శకుడిగా విజయం సాధించాలి అంటే మాత్రం గట్స్ ఉండాలి. అయితే కొందరు హీరోలు తమకు డైరెక్షన్ చేయాలి అనే కల ఉంది అంటారు. అందుకోసం ట్రైనింగ్ కూడా అవసరమైతే తీసుకుంటాం అని చెప్తూ ఉంటారు. అయితే మన తెలుగులో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినా సరే దర్శకులుగా పని చేయాలంటే మాత్రం ముందుకు రాలేదు హీరోలు.
Also Read:సల్మాన్ ఖాన్ కు సమన్లు
మన తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి విజయాలు అందుకున్నారు. అయితే ఏఎన్ఆర్, శోభన్ బాబు, మోహన్ బాబు వంటి వారు మాత్రం దర్శకత్వం వైపు వెళ్ళలేదు. దానికి కారణం డైరక్షన్ ఉండే విజన్ హీరో కి లేకపోవడమే. మంచి విజయాలు సాధించి కెరీర్ మొదట్లో దూకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ జానీ సినిమాతో దర్శకుడిగా మారాడు. కాని ఆ సినిమాఫ్లాప్ తో ప్పవాన్ మళ్ళీ డైరెక్షన్ జోలికి వెళ్ళలేదు.
చిరంజీవి సహా బాలకృష్ణ వంటి వారు ఎవరూ కూడా దర్శకత్వం వైపు వెళ్ళలేదు. కొందరు హీరో మెటీరీయల్ మరికొందరు డైరక్షన్ మెటీరీయల్. కమల్ హాసన్ తన కెరీర్ లో చేయని పాత్ర లేదు. నటుడిగా ఆయన చూడని పాత్రలు కూడా లేవు. కాని విశ్వరూపం సినిమా తర్వాత ఆయన డైరెక్షన్ అంటే భయపడ్డారు. కాని నిర్మాత్లుగామాత్రమం హీరోలు విజయం సాధిస్తున్నారు.
కేరళ నటుడు పృథ్వి రాజ్ సుకుమారాన్ మాత్రమే ఈ తరంలో డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. లూసిఫార్ అనే సినిమా తీసి ఆ సినిమాతో పరిశ్రమను షేక్ చేసాడు. ఇక మన తెలుగులో నిర్మాతలుగా చేసినా సరే డైరెక్షన్ సాహసం చేయని వారిలో ముందు వరుసలో ఉండేది… నాగార్జున, మహేష్, రామ్ చరణ్, కళ్యాణ్ రాం వంటి వారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ గా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన నాని, రాజ్ తరుణ్, రణభీర్ కపూర్, కార్తీ, రవితేజ వంటి వారు హీరోలుగానే సినిమా చేస్తున్నారు.
Also Read:చిన్న వయసు లో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో మీకు తెలుసా ?