సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఆదాయం బాగా పెరిగింది. దీని ద్వారా క్రేజ్ పెంచుకుని ఆదాయం పెంచుకుంటున్నారు. యూట్యూబ్ లో వీడియో లు చేస్తూ లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. టాలీవుడ్ లో సినిమాలు కూడా చేస్తున్నారు. దాదాపు అన్ని భాషల్లో పరిస్థితి అలాగే ఉంది. వాళ్లకు క్రేజ్ ఉంటే దర్శకులు వారికి అవకాశాలు కూడా ఇస్తున్నారు.
ఇలా గంగవ్వ సోషల్ మీడియా ద్వారా క్రేజ్ పెంచుకుని సినినిమాల్లోకి కూడా అడుగు పెట్టారు. ఆమె బిగ్ బాస్ లో కూడా నటించి అలరించారు. బిగ్ బాస్ లో ఆమె ఎక్కువ రోజులు ఉండలేకపోయారు అనే చెప్పాలి. ప్రస్తుతం యూట్యూబ్ ఆదాయంతో పాటుగా సినిమాల్లో కూడా ఆమె ఎక్కువగా కనపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆదాయం కూడా భారీగానే ఉందని, ఆమె ఆర్ధిక కష్టాలు కూడా పోయాయి అంటున్నారు.
ఆమె ఆదాయం నెలకు 5 నుంచి 7 లక్షల వరకు ఉందని సమాచారం. సినిమాలతో పాటుగా బుల్లి తెర అలాగే యూట్యూబ్ లో కూడా సందడి చేస్తుంది ఆమె. తనకు పేరు తెచ్చిన యూట్యూబ్ ని మాత్రం ఆమె వదులుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. త్వరలోనే మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాల్లో కూడా గంగవ్వ కనపడే అవకాశం ఉందని సమాచారం. మరి ఆమెకు అవకాశాలు ఏ స్థాయిలో వస్తాయో చూడాలి.