పచ్చిమిర్చి లేకుండా ఏ వంటా ఉండదు. పులిహోర నుంచి పెద్ద పెద్ద వంటల వరకు పచ్చి మిర్చి కావాల్సిందేగా మరి. అందుకే పచ్చి మిర్చి పంటకు ఇండియాలో అంత డిమాండ్ ఉంటుంది. పచ్చి మిర్చి ఇక్కడి నుంచి అనేక దేశాలకు ఎగుమతి చేసారు. ఇక టమాటో, క్యాబేజీ కూడా మన దేశాలో ఎక్కువగానే పండుతుంది. అయితే వీటికి మన ఇండియాకి ఏం సంబంధం లేదు మాస్టారూ. అసలు అవి మన సంస్కృతి కాదు.
బంగాళా దుంప
ఇది దక్షిణ అమెరికా లోని పెరు కి సంబంధించి ఈ దుంపకు ఇండియా లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. చిప్స్, ఫ్రైస్ అంటూ మంచి మార్కెట్ జరుగుతుంది. కొలంబస్ దక్షిణ అమెరికాను కోలోనైజ్ చేసే సమయంలో ఐరోపాకు తీసుకు రాగా అక్కడి నుంచి ఇండియా వచ్చింది. సుమారుగా 8 వేల ఏళ్ళ క్రితమే సాగు చేసారు.
కారేట్ – గాజర్
వీటికి మనకు ఏ సంబంధం లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో ముందు వీటిని సాగు చేసారని కొందరు చెప్తే ఇరాన్ లో అని మరికొందరు అంటారు. వీటి రంగు అసలు మనం చూసేది కాదు. బచ్చలి పండు రంగులో ఉండేవి. ఆల్ఫా బీటా కెరీటీన్ వల్ల ఈ రంగు వచ్చింది. ఓ రకం కొంగలకు ఆరెంజ్ రంగు ఈకలు ఉండేందుకు జు పార్కు వారు క్యారెట్ లు పెట్టె వారు.
కాబేజీ
చైనీస్ ఫుడ్ లో ఎక్కువగా వాడే ఈ పువ్వుకి కూడా మన ఇండియాతో సంబంధం లేదు. ఐరోపాకు చెందిన దీనిని మన ఇండియాకు పోర్చుగీసు వారు తెచ్చి సాగు చేసారు.
మిర్చి
వీటిని కూడా వాళ్ళే తెచ్చి ఇక్కడ పడేసి పోయారు. వాస్తవానికి కారం కోసం మనం మిరియాలు వాడే వాళ్ళం. వాళ్ళ ఖండం లో మిరియాలకు డిమాండ్ పెరగడంతో మన మిరియాలు పట్టుకుపోయి వాటిని ఇక్కడ ఉంచారు. ఇప్పుడు అవి లేని వంట లేదు. తమిళనాడులో చేసే వంటల్లో కూటు, కొళంబు ఇత్యాది వంటకాలలో మిర్చి వాడకం ఉండదు.
టమాటో
వీటిని కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పండించారు. 60–70 ఏళ్ళ క్రితం వరకూ వీటికి డిమాండ్ లేదు, సాగు చేసే వాళ్ళు కూడా లేరు.