ఇండియాకు 21 రోజుల లాక్ డౌన్ సరిపోదా…? అంటే అవుననే అంటున్నాయి పలు విశ్లేషణలు. చైనా నుండి కరోనా వైరస్ వ్యాప్తి యూరప్ దేశాలకు పాకిన తర్వాత అక్కడి అంచనాలను ముందే పసిగట్టిన కొందరు ఇప్పుడు భారత్ లో కరోనా విస్తృతిపై తమ అభిప్రాయాలను ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ లో ప్రచురించారు. ఆ కథనం ప్రకారం….
అమెరికాలో కరోనా వైరస్ విస్తృతి ఎలా ఉంటుంది అనేది ముందే అంచనా వేయగలిగాం. అదే నిజమయ్యింది. 2 లక్షల కేసులు ఉంటాయని అనుకున్నదే అయ్యింది. మరణాల సంఖ్య కూడా ఏప్రిల్ 4వరకు 6400, ఏప్రిల్ 15 వరకు 20వేల మంది చనిపోతారని అంచనా వేశాము. పరిస్థితులు అలాగే ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, భారత్ లో యువత శాతం ఎక్కువగా ఉన్నందున ప్రతి వంద మందిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని, కరోనా వైరస్ సోకిన కొందరిలో 4 నుండి 5 రోజుల్లోనే లక్షణాలు చూపిస్తుందని, కొందరిలో 14 రోజులకు… మరికొందరు పరిస్థితి విషమించిన తర్వాత ఆసుపత్రికి వస్తున్నారని… తద్వారా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు కరోనా వైరస్ కారణంగా చనిపోతున్న వారికి 24 రోజుల ముందే వైరస్ సోకిందని భావించాల్సి ఉంటుందని, ఆ లెక్కన ఈ రోజు ఇండియాలో 100 కరోనా మరణాలు జరిగాయంటే కేసుల సంఖ్య 8600 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం మార్చి 11 వరకు వైరస్ సోకిన వారి లెక్క మాత్రమే.
ఇక భారత అధికారులు మార్చి 11వరకు కరోనాతో దేశవ్యాప్తంగా 60మంది మరణించారని ప్రకటించారు. అంటే… కరోనా వైరస్ ఎలా విస్పోటనం చెందుతుందో పరిశీలించాలి. అమెరికా సహా ఇతర దేశాల్లో ప్రతి మూడు రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపవుతుంది. అదే ఇండియాలో వివిద కారణాలతో 4 రోజులకు ఒకసారి రెట్టింపు అవుతందని అంచనా వేయవచ్చు. కోరనా తో కాస్త అలర్ట్ గా ఉండటంతో పాటు సామాజిక దూరం పాటించటం అందుకు కారణాలుగా మనం పరిగణించవచ్చు.
మార్చి 11 వరకే 8600మందికి పాజిటివ్ కేసులున్నాయని అంచనా వేస్తున్నప్పుడు… ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఆ సంఖ్య రెట్టింపు వేసుకున్నా..మార్చి 15 వరకు 17200, మార్చి 19వరకు 34400, మార్చి 23వరకు 68800మందికి కరోనా సోకినట్లు మనం భావించాల్సి ఉంటుంది.
అయితే… మార్చి 24న ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత కేసులేవీ పెరగలేదని అనుకున్నా… మార్చి 24వరకు వచ్చే 75000 కేసుల్లో ఒకశాతం మరణాల రేటును తీసినా 750 మంది మరణించే అవకాశం ఉంటుంది. కానీ ఈ మరణాల సంఖ్య, కేసుల సంఖ్య యూరప్ దేశాలతో పోల్చితే చాలా తక్కువ. అయితే… ఏప్రిల్ 14 తేదీకి 21 రోజుల లాక్ డౌన్ పూర్తవుతుంది.
లాక్ డౌన్ పూర్తవ్వగానే జనం రోడ్లపైకి వస్తారు. కానీ లాక్ డౌన్ పిరియడ్ అంటే 21 రోజులు పూర్తి వరకు వచ్చిన కొత్త కరోనా కేసుల నుండి మళ్లీ వైరస్ వ్యాప్తి విజృంభించే అవకాశం చాలా ఎక్కువ. కానీ లాక్ డౌన్ ను కొనసాగిస్తే… వైరస్ కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే ఆర్థికరంగంపై ఈ లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపుతున్నందున… లాక్ డౌన్ కొనసాగిస్తే భారత్ కూడా ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉంది.
ఓ వైపు ప్రజారోగ్యం, మరో వైపు దేశ ఆర్థిక వ్యవస్థలను ప్రధాని మోడీ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి అంటూ కథనాలు వినిపిస్తున్నాయి.