కరోనా వైరస్ ప్రభావం మొదలైన తర్వాత చాలా మందిలో ఉన్న సందేహాలు నీళ్ళు ఎలా తాగాలి, ఎన్ని తాగాలి…? ఏ విధంగా తాగితే మన ఆరోగ్యానికి మంచిది…? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. కొందరు ఉదయం టీవీల్లో కనపడి నీళ్ళు ఎంత తాగితే అంత మంచిది అంటూ సలహాలు సూచనలు ఇచ్చే పనిలో ఉంటారు. అది విని ఇష్టం వచ్చినట్టు నీళ్ళు తాగుతూ ఉంటారు.
ప్రతీ రోజు కనీసం అయిదు లీటర్ల నీళ్ళు తాగితే మంచిది అనే సలహా ఇవ్వడం దాన్ని జనాలు పాటించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అలా చేయడం మన ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది ఒక్కసారి చూస్తే, రోజు అయిదు లీటర్ల నీళ్ళు తాగితే లేనిపోని సమస్యలు వస్తాయి. రోజు అయిదు లీటర్ల నీళ్ళు మగాళ్ళు ఒక పది రోజులు వరుసగా తాగితే శృంగార సామర్ధ్యం పై ప్రభావం పడుతుంది.
Advertisements
ఎంత అవసరం ఉంటే అంత తాగడం చాలా మంచిది. కిడ్నీలో రాళ్లు పడే అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ నీళ్ళు తాగాలి. కాల్షియమ్ గోళీలు తింటే, టమాటా పాలక్ కలిపి తింటే తప్పక కిడ్నీలో రాళ్ళు వస్తాయి. అప్పుడు ఎక్కువ నీళ్ళు తాగడం మంచిది. ఇలాంటి ఆహార పదార్ధాలు తింటే నీళ్ళు ఎక్కువ తాగాల్సి ఉంటుంది. 8 గ్లాసులు అంటే 2 లీటర్స్ తాగితే చాలు.