చాలా మంది సిగ్నల్ లైట్ దగ్గర ఇంజిన్ ఆపకుండా అలానే ఉంచుతూ ఉంటే కొందరు మాత్రం పెట్రోల్ ఆదా చేసే ఉద్దేశంతో సిగ్నల్ లైట్ దగ్గర ఇంజిన్ ఆపేస్తారు. అసలు ఇంజిన్ ఆపడం మంచిదా లేకపోతే అలా ఆన్ లో ఉండటం మంచిదా అనేది చాలా మందికి తెలియదు. ఏం చేస్తే మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సిగ్నల్ లైట్ దగ్గర ఇంజిన్ ఆపడం, లేదా ఆపకపోవడం లో ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి.
Also Read:వంద రోజుల ఆర్ ఆర్ ఆర్..!!
ఇంధనం ఆదా చేసే దృష్టిలో ఆలోచిస్తే గనుక సిగ్నల్ లైట్ దగ్గర 10 సెకండ్లకి మించి ఆపితే ఇంజిన్ ఆపడమే బెటర్. ఇలా ఆపడం వల్ల ఇంధనం ఆదా అవడమే కాకుండా కాలుష్యం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉనాయి. అయితే ఇలా చేస్తే వచ్చే సమస్య ఏంటో చూద్దాం. అత్యవసర పరిస్థితులలో బండిని ముందుకు తీసుకు వెళ్ళాల్సిన అవసరం వస్తే… ఆగిపోయిన బండిని “స్టార్టు” చేసి వెళ్ళడం కంటే ఆన్ చేసి ఉన్న ఇంజిన్ తో ఆ పని చేయడం బెటర్.
కాబట్టి భద్రత, యోగక్షేమాల దృష్ట్యా ఇంజనుని ఆన్ లో ఉంచడమే మంచిది. అయితే పూర్తి ట్రాఫిక్ లో ఉండి బండి కదిలే అవకాశం లేదన్నప్పుడు ఇంజిన్ ఆపడమే బెస్ట్. ఇక ఘాట్ రోడ్ లో కొండపై దిగే సమయంలో కూడా ఇదే వర్తిస్తుంది. పెట్రోలుని ఆదా చేద్దామని దిగే దారిలో ఇంజనుని ఎప్పుడూ ఆపడం మంచిది కాదు. బండి మన అధీనంలో ఉండాలంటే గనుక ఇంజిన్ ఆన్ లో ఉండటమే మంచిది.