బరువు తగ్గడానికి మనం పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. పొట్ట తగ్గాలని నానా కష్టాలు పడుతూ ఉంటారు. పొట్ట తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే తగ్గకపోవడంతో తిండి మానేస్తూ ఉంటారు కొందరు. ఇక రాత్రి సమయంలో మనం తీసుకునే ఆహారమే శరీరం తగ్గడానికి ఉపయోగపడుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక వయసు పెరుగుతున్న వారు ఏ విధమైన ఆహారం తీసుకుంటే మంచిది అనేది స్పష్టత లేదు చాలా మందికి. కొందరు మజ్జిగ తాగి పడుకోవడం, కొందరు చపాతి తినడం లేదా ఇడ్లీ తినడం వంటివి జరుగుతున్నాయి. అసలు మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత అన్నం కంటే కూడా రాత్రి సమయంలో చాలా వరకు తేలికపాటి ఆహారమే తినడం ఉత్తమం.
Advertisements
చపాతి లేదా అల్పాహారం లేదా ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు. బీపీ షుగర్ గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్లు ఊపిరితిత్తులు ఆస్తమా దగ్గు ఆయాసం ఉన్నవాళ్లు రాత్రుళ్ళు భోజనం మానేసి చపాతి తినడంతో కాస్త మంచి నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు లేని వాళ్ళు అన్నం కూడా తినవచ్చు. చపాతి మాత్రమే తింటే మంచిదా అంటే ఏది తిన్నా మంచిదే గాని ఖాళీ కడుపుతో పడుకోవడం మాత్రం మంచిది కాదు.