కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేసింది. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతున్న సమయంలో…ఇదివరకే కరోనా వచ్చి కోలుకున్న వారు వ్యాక్సిన్ వేసుకోవాలా…? అవసరం లేదా…? అన్న అనుమనాలున్నాయి.
వైరస్ సోకి కోలుకున్నారంటే వారిలో రోగనిరోధక శక్తి పెరిగినట్లుగా భావించాలి. అయితే, ఆ యాంటీబాడీస్ మన శరీరంలో ఎన్నాళ్లుంటాయన్నది ప్రశ్న. అది వారి వారి శరీరాలు, అహారపు అలవాట్లు, జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వైరస్ భవిష్యత్ లో అటాక్ చేయకుండా ఉండేందుకు కరోనా నుండి కోలుకున్న వారు సైతం వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం సూచించింది.
పైగా టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని… భవిష్యత్ లో మన రోగనిరోధక శక్తి తగ్గకుండా ఉండేందుకు ఇవి దోహదపడతాయని స్పష్టం చేస్తున్నారు. గత మూడు నెలల్లో కరోనా బారిన పడనివారు టీకా తీసుకునేందుకు ఆలస్యం చేసినా ఫరవాలేదని.. దానివల్ల ఇతరులకు వ్యాక్సిన్ త్వరగా అందుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఆలస్యం అయినా టీకా మాత్రం తప్పక తీసుకోవాలంటున్నారు.