మన దేశం వాళ్ళు ఐరోపా దేశాలతో పాటుగా ఎన్నో దేశాల పర్యటనకు వెళ్లి వస్తు ఉంటారు. ఆఫ్రికా దేశాల్లో కూడా పర్యటనలు చేసే వాళ్ళు ఉన్నారు. అయితే మన పొరుగున ఉన్న పాకిస్తాన్ లో పర్యటనకు వెళ్ళడం సాధ్యమా…? పాకిస్తాన్ వెళ్లేందుకు వీలు అవుతుందా…? అసలు వీసా ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం.
Also Read:హుస్నాబాద్ లో అక్రమ లేఅవుట్లు.. మున్సిపాలిటి ఆదాయానికి గండి
పాకిస్తాన్ లో పర్యటించాలని అక్కడ సంస్కృతి చూడాలని మన దేశంలో కొందరికి కలగానే ఉంది. లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ నగరాల్లో తిరగాలని అక్కడ… తక్షశిల శిధిలాల్లో చాణక్యుని అడుగుజాడల్ని వెతకాలని స్వాత్ వ్యాలీలో తిరగాలని చాలా మందికి కోరిక. అఖండ భారతావనికి ఒకప్పుడు ఎల్లగా ఉన్న… హిందూకుష్ పర్వత శ్రేణిని చూడాలనే కోరికలు చాలా మందికి ఉన్నాయి.
భారత్, పాకిస్తాన్ మధ్య పర్యాటక వీసా ఒప్పందం లేదు. రెండు దేశాల ప్రజలకు వీసాలు దొరకడం లేదు. ఆ దేశంలో మన రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని… వారిని చూడాలని నిరూపిస్తే మినహా మనకు పర్యాటక వీసా దొరికే ఛాన్స్ లేదు. మతపరమైన ఆలయాలకు సంబంధించి దర్శనం దొరుకుతుంది అని చెప్తారుగాని దొరకడం కష్టమే. ఒకవేళ వచ్చినా సరే అక్కడికి మాత్రమె వెళ్ళాలి.
ఇక వ్యాపార టూర్ కు వెళ్లాలనుకున్నా సరే ఎవరైనా స్పాన్సర్ చేస్తే మినహా వెళ్ళడం సాధ్యం కాదు. ఇంత కష్టపడి వీసా వచ్చినా సరే రేపు ఏదైనా దేశానికి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ లో పాకిస్తాన్ వీసా స్టాంప్ ఉంటే అమెరికా సహా కొన్ని దేశాల వీసాలు అంత ఈజీగా రావు. వచ్చినా సరే ఇమ్మిగ్రేషన్ తలనొప్పి ఉంటుంది.
Also Read:ఆస్ట్రేలియా నుంచి పురాతన విగ్రహాలు.. పరిశీలించిన ప్రధాని..!