సాధారణంగా మనం సినిమాల్లో గాని ఏదైనా ఆర్మీ వీడియోలో గాని చూస్తే హెలికాప్టర్ గాలిలో ఆగుతుంది. కాని విమానం గాల్లో ఆగింది అనే మాట మనకు వినపడదు. విమానం మాత్రం గాల్లో చక్కర్లు కొట్టింది అని వింటాం. అయితే చాలా మందిలో ఉండే సందేహం హెలికాప్టర్ మాదిరి విమానం కూడా గాల్లో ఆగుతుందా అని. వాస్తవం చెప్పాలి అంటే విమానం గాలిలో ఆగలేదు. కానీ హెలికాప్టర్ మాత్రం గాలిలో ఆగుతుంది.
Also Read:భారత్ కు అండగా ఉంటాం…!
ఈ రెండు గాలిలో తేలడానికి వాడే ఏరోడైనమిక్స్ సూత్రాలు ఒకటే. కాని వాటి మెకానిక్స్ మాత్రం వేరుగా ఉంటుంది. మొదటిగా విమానం ముందుకు వెళ్ళడానికి విమానంలో ఉండే ఇంజన్లు దోహదం చేస్తాయి. విమానం ఎగరడానికి దాని రెక్కలు సహకరిస్తాయి. రెక్కలు కేవలం విమానం కొంత నిర్దష్ట వేగముతో వెళ్ళినపుడే విమానమును గాలిలో తేలగలిగేలా చేయగలవు. ఆ వేగాన్ని స్టాల్ స్పీడ్ అని పిలుస్తారు.
ఈ స్టాల్ స్పీడ్ విమానం బరువుపై ఆధారపడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటీ అంటే… విమానం గాల్లో కదలకుండా ఉంటే రెక్కలు విమానాన్ని గాల్లో ఉంచలేవు. కాబట్టి విమానాన్ని గాల్లో ఉంచడం సాధ్యం కాదు. కాబట్టి విమానం గాల్లో ఉండాలి అంటే కచ్చితంగా ప్రయాణం చేయాల్సిందే. విమానం పడిపోకుండా ఉండాలి అంటే ఎప్పుడు పైలెట్స్ విమానంను కనీస స్టాల్ స్పీడ్ వేగంతో ముందుకు నడపాలి. విమానం గాలిలో ఉన్నపుడు, కొన్ని సార్లు ఇంజన్లు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే కొంతవేగంగా కదులుతున్న విమానం రెక్కల సాయంతో కొంత దూరం వెళ్తుంది. ఈ లోపు ఇంజిన్ ఆన్ చేసుకోవచ్చు.
Also Read:అంటార్కటికాలో ఎందుకు అంత చల్లగా ఉంటుంది…? అక్కడ అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఎంత…?