రోజులో కనీసం రెండు మూడు సార్లు అయినా కాఫీ తాగకపోతే పిచ్చి ఎక్కిపోయే వాళ్ళు ఉన్నారు. కాఫీని కొందరు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే కాఫీ తో వచ్చే ప్రయోజనాలు మాత్రం చాలా మందికి అవగాహన లేదు. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఒక సంచలన విషయం బయటపెట్టారు. కాఫీ వినియోగం తీవ్రమైన కిడ్నీ ప్రమాదాల నుంచి రక్షిస్తుంది అని గుర్తించారు.
Also Read: ఆ స్కూల్ లో హిట్లర్ కు అడ్మిషన్ వచ్చి ఉంటే… రెండో ప్రపంచ యుద్ధం జరిగేది కాదా…?
జర్నల్ కిడ్నీ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్‌లో మే 5న ప్రచురించిన పరిశోధనల ప్రకారం ప్రతిరోజూ ఎంతోకొంత కాఫీ తాగే వారికి అకి అనే వ్యాధి వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉందని గుర్తించారు. రోజుకు రెండు నుండి మూడు కప్పులు తాగిన వారికి 22%-23% తక్కువ ప్రమాదం ఉందని తెలిపారు. టైప్ 2 డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ అలాగే లివర్ డిసీజ్‌లతో సహా దీర్ఘకాలిక, క్షీణించిన వ్యాధుల నివారణకు రోజూ కాఫీ తాగడం ముడిపడి ఉందని పరిశోధకులు తెలిపారు.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో నెఫ్రాలజీ మరియు మెడిసిన్ ప్రొఫెసర్ మాట్లాడుతూ… కెఫిన్ అకి ప్రమాదాన్ని తగ్గిస్తుందని గుర్తించారు. ఈ వ్యాధి వస్తే… రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోతాయని… మూత్రపిండాలు శరీరంలోని ద్రవాల సమతుల్యతను సరిగ్గా నిర్వహించడం కష్టమవుతుందని పేర్కొన్నారు.
ఇక లక్షణాలు ఒకసారి చూస్తే… మూత్రం చాలా తక్కువగా వస్తుందని కాళ్ళు, చీలమండలలో వాపు ఉంటుందని, కళ్ళు చుట్టూ వలయాలు ఏర్పడి అలసిపోయినట్టుగా కనపడతాయని పేర్కొన్నారు. శ్వాస ఆడకపోవడం, గందరగోళం, వికారం, ఛాతి నొప్పి సహా పలు లక్షణాలు ఉంటాయని కొన్ని సార్లు కోమాలోకి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
Also Read: చెమట పొక్కులు ఎలా వస్తాయి…? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి…?