సీనియర్ నటి నిర్మలమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పటి జనరేషన్ వారికైనా… ఇప్పటి జనరేషన్ వారికైనా నిర్మలమ్మ పరిచయస్తురాలు. హీరోలకు హీరోయిన్లకు అమ్మగా, బామ్మగా కొన్ని వందల సినిమాల్లో నటించారు నిర్మలమ్మ. అప్పటి తరం ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, అలాగే ఇప్పటి తరం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అందరి సినిమాలలో నటించింది నిర్మలమ్మ.
అయితే నిర్మలమ్మ తెలుగు ఇండస్ట్రీ లోకి ఎలా వచ్చింది వెనుక ఉన్న కథేంటి అనేది చాలా మందికి తెలీదు. నిర్మలమ్మ అసలు పేరు రాజామణి. 1927 నవంబర్ లో పుట్టారు నిర్మలమ్మ. చిన్ననాటినుంచి ఆటపాటలలో ఎంతో చలాకీగా ఉండే నిర్మలమ్మ కు డాన్స్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో చిత్రపురి నాటకంలో నటించే అవకాశం నిర్మలమ్మ కు వచ్చింది. ఆ తర్వాత 14వ ఏట భక్త ప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదుడు గా నటించే అవకాశం వచ్చింది. తెలుగు బాగా రావడంతో పద్యాలు కూడా అద్భుతంగా చెప్పేది నిర్మలమ్మ.
చిరంజీవి సినిమా పై శేఖర్ మాస్టర్ టంగ్ స్లిప్! సినిమా యూనిట్ కి కష్టాలు తప్పవా ?
మొదట ఆమె నటించిన సక్కుబాయి నాటకం మంచి పేరును తీసుకువచ్చింది. ఆ తర్వాత ఘంటసాల రాఘవయ్య గారు ఆమెను ఫోటోలో చూసి గరుడ గర్వభంగం సత్యభామ చెలికత్తె వేషం ఇచ్చారు. ఇక నిర్మలమ్మ కు 19వ సంవత్సరం వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని తల్లి కోరిందట. వెంటనే తనని కళాకారిణిగా ప్రోత్సహించే వ్యక్తిని చేసుకుంటానని నిర్మలమ్మ చెప్పిందట. ఈ నేపథ్యంలోనే కళాకారుడైన జీవి కృష్ణ మూర్తి ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరిదీ ఒకటే మాట గా నడిచింది.
కొన్నాళ్లకు నిర్మలమ్మ కరువు రోజులు అనే ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో ఆ నాటకానికి హిందీ ప్రముఖ నటులు పృథ్విరాజ్ కపూర్ హాజరయ్యారట. స్టేజ్ మీద పావుగంటపాటు శవంలా నిర్మల పడి ఉన్నారట. నాటకం పూర్తయిన తర్వాత పృథ్విరాజ్ కపూర్ శవం బాగా నటించిందని అన్నారట. ఆ కొన్నాళ్లకు పదహారేళ్ళ వయసు సినిమాలో నటించారు. ఈ సినిమా తో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడింది కానీ అనుకున్న స్థాయిలో అయితే ఫలితం రాలేదట. అంతే కాదు మీ గొంతు కూడా బాగోలేదని చెప్పారట. సినిమాలకు గొంతు సెట్ అవ్వదు అని కూడా చెప్పారట. అయినప్పటికీ పట్టు వదల్లేదట నిర్మలమ్మ. ఆ తరువాత ఎత్తుకు పై ఎత్తు, మనుషులు మారాలి వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న నిర్మలమ్మ వెనక్కి తిరిగి చూడలేదు. సుమారు 900లకు పైగా సినిమాలలో నటించింది.
ఒకే సంవత్సరంలో 19 చిత్రాలలో నటించిన రికార్డు నిర్మలమ్మకు సొంతం. హిందీ, తమిళ, చిత్రాలలో కూడా నటించింది. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పేది నిర్మలమ్మ. అంతేకాకుండా ఎక్కువగా తెలుపు రంగు బట్టలను మాత్రమే ధరించేవారు. మేకప్ కూడా ఎక్కువగా వేసుకునేవారు కాదట. చెవి దుద్దులు, మెడలో గొలుసు, రెండు చేతులకు గాజులు మాత్రమే పెట్టుకునేవారట.
నేను వేసిన పాత్రలు ఎవరైనా వేస్తే చూసి చనిపోవాలని ఉంది అని ఆమె ఎప్పుడూ అంటూ ఉండేవారట. ఏ సినిమా మొదలు పెట్టిన ఆ సినిమా పూర్తయ్యే వరకు నేను బ్రతికే ఉండాలని చూడు దేవుడా అని కోరుకుంటాను… ఎందుకంటే నేను చనిపోతే ఆ సినిమాకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అనేవారు నిర్మలమ్మ.
ALSO READ : కే జి ఎఫ్ హీరో యష్ ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ? సీరియల్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి నేడు!
వయసు పైబడిన తరువాత సినిమాలు చేయటానికి ఇష్టం లేనప్పటికీ కూడా కొంతమంది బలవంతంతో సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చారు నిర్మలమ్మ. అందులో విజయబాపినీడు ఒకరని చెప్పుకొచ్చారు నిర్మలమ్మ. అలాగే దాసరి నారాయణ రావు ఎస్ వి కృష్ణారెడ్డి సినిమాలలో కూడా నటించారు. ఇక హరికృష్ణ నాగార్జున నటించిన సీతారామరాజు సినిమాలో కూడా తప్పదు అని పట్టు పడితే నటించాల్సి వచ్చిందట. ఇక ఆమె ఆఖరి గా నటించిన చిత్రం ప్రేమకు స్వాగతం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2002వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో ఆఖరి గా నటించారు.
Advertisements
ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. 2009 ఫిబ్రవరి 19న తుది శ్వాస విడిచారు నిర్మలమ్మ. అయితే నిర్మలమ్మకు పిల్లలు లేకపోవడంతో కవిత అని అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేశారు. ఆమెకి ఇద్దరు పిల్లలు, కాగా తల్లి మీద ప్రేమతో కవిత తన పిల్లలు ఒకరైన అమ్మాయికి నిర్మల అని పేరు పెట్టుకుంది.