ఒకరిని పోలిన వారు మరొకరు ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. సినిమాల్లో చూపించిన విధంగా ఏడుగురు ఉంటారా అంటే దానికి ఏ విధమైన లెక్కలు కూడా అధికారికంగా ఎవరూ చెప్పిన దాఖలాలు అయితే లేవు. ఒకరు ఏది చెప్తే అందరూ అదే ఫాలో అవుతారు కాబట్టి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటే నమ్మేస్తాం. అసలు అలా పోలికలు ఉన్న వారిని ఏమంటారు ఏంటీ అనేది చూద్దాం.
మనిషిని పోలిన మనుషులు ఉంటారు. ఒకరిని పోలిన వారు ఇంకొకరు ఉంటారు అంతే. అనుకోకుండా ఒక వ్యక్తిని చూసినప్పుడు మనం గతంలో చూసిన వ్యక్తిలా ఉండవచ్చు. కాని ఇతనే అనుకునే అవకాశం ఉండదు. తేడా స్పష్టంగా ముఖాల్లో ఉంటుంది. అలా లేకపోతే మాత్రం వాళ్ళు కవల పిల్లలు అయి ఉండాలి. కవలల్లో మాత్రమే అటువంటి పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకరికి ఒకరు సంబంధం లేనివారిలో పోలికలు చాలా తక్కువ అనే చెప్పాలి.
అలా పోలికలు కాస్తో కూస్తో ఉండే వాళ్ళను డపుల్ గ్యాంగర్స్ అంటారు. సినిమా నటులను పోలిన వారు మనకు కొందరు కనపడుతూ ఉంటారు. కనుబొమ్మలు కలవడం లేదా నవ్వు ఒకే విధంగా ఉండటం వంటివి మాత్రమే జరుగుతుంది. అంతే గాని సినిమాలో చూపించినట్టు అసలు ఒకే ఎత్తు, ఒకే రంగు ఉండే సమస్యే లేదు. ఏడుగురు ఉంటారు అనేది ఇప్పటి వరకు ఎక్కడా ప్రూవ్ కాలేదు. కేవలం అదో కల్పిత కథ మాత్రమే.