సాధారణంగా హీరోలు డబుల్ రోల్ లో యాక్ట్ చేయడం అంటే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అగ్ర హీరోలు కూడా ఈ విషయంలో భయపడుతూ ఉంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం వెనకడుగు వేయరు. అందులో నందమూరి కుటుంబం హీరోలు డబుల్ రోల్ సినిమాలు చేసేందుకు ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. గతంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కూడా నటించి మెప్పించారు.
ఇక బాలకృష్ణ కూడా రెండు పాత్రల్లో నటించి మెప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే జైలవకుశ సినిమాలో మూడు పాత్రల్లో కూడా నటించాడు. అంతకు ముందు రెండు పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ తరంలో మూడు పాత్రల్లో నటించింది మాత్రం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. సీనియర్ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమాలో మూడు పాత్రల్లో చేసారు.
ఆ తర్వాత కమల్ హాసన్ వంటి హీరోలు చేసారు. ఇది తమ తమ సినిమాలకు పెద్ద ప్రమోషన్ గా భావిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్ర అతనికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ తరంలో హీరోలు డబుల్ రోల్ చేయడానికి భయపడుతున్నారు. రామ్ చరణ్… శంకర్ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు. మరే ఇతర యువ హీరోలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు.