వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ ఉసేన్ బోల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేసినట్టుగా చెబుతున్న కర్ణాటక కు చెందిన శ్రీనివాస గౌడ తనకు మార్చి 10 వరకు కంబాల పోటీలు ఉండడంతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆహ్వానం మేరకు స్పోర్ట్స్ ఆథార్టీ ఆఫ్ ఇండియా ట్రయల్స్ కు గైర్హాజరయ్యారు.
కర్ణాటకలోని మూడబిద్రికి చెందిన శ్రీనివాస గౌడ, నిర్మాణ కార్మికుడు. కంబాల( బర్రెల పోటీ) లో మంచి చాంఫియన్. ఇటీవల మంగళూరు సమీపంలోని ఐకాల గ్రామంలో జరిగిన కంబాల పోటీల్లో రన్నింగ్ లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన జమైకా రన్నర్ ఉసేన్ బోల్ట్ ను రికార్డును బ్రేక్ చేశాడు. ఉసేన్ బోల్ట్ 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేసి రికార్డ్ సృష్టించారు. అదే 100 మీటర్లను 9.55 సెకన్లలో పూర్తి చేసి శ్రీనివాస గౌడ ఉసేన్ రికార్డ్ ను బ్రేక్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరలయ్యింది. అయితే శ్రీనివాస గౌడ రన్నింగ్ ట్రాక్ పై కాకుండా…అంతా బురద పొలాల్లో బర్రెలతో పాటు జరిగింది. దీంతో ప్రజలు అభినందనలతో ముంచెత్తారు.
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు కంబాలా జాకీ శ్రీనివాస గౌడ కు ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా స్పోర్ట్స్ ఆథార్టీ ఆఫ్ ఇండియా ను ఆదేశించారు. ఒలంఫిక్స్ స్టాండర్డ్స్ గురించి గ్రామీణ ప్రాంతాల వారికి పెద్దగా అవగాహన లేదు…ముఖ్యంగా అథ్లెటిక్స్ లో ఎంత శక్తి కావాలి..ఎంత సేపట్లో లక్ష్యాన్ని చేరుకుంటామనే విషయం తెలియదు.. ఏది ఏమైనా ప్రతిభ కలిగిన ఏ ఇండియన్ ను పరీక్షించకుండా వదలం అంటూ రిజిజు ట్విట్టర్ లో రాశారు.
కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ ఆథార్టీ ఆఫ్ ఇండియా శ్రీనివాస గౌడకు ఆహ్వానం పంపింది. సోమవారం బెంగళూరు స్పోర్ట్స్ ఆథార్టీకి వచ్చి ట్రయల్స్ కు హాజరు కావాల్సిందిగా కోరింది. అయితే దీనికి కంబాల జాకీ శ్రీనివాసగౌడ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మార్చి 10 వరకు కంబాల పోటీలు ఉన్నందున ఆయన ట్రయల్స్ కు హాజరుకావడం లేదని తెలిసింది. సోమవారం ముఖ్యమత్రి యడ్యూరప్పను కలుస్తున్నట్టు తెలిసింది. కంబాల క్రీడ మిగతా వాటికి భిన్నమైనది కావడంతో మార్చి 10 వరకు ఆ క్రీడా పోటీల్లో పాల్గొంటానని శ్రీనివాస గౌడ ఓ మీడియాకు తెలిపారు. దీంతో అతను స్పోర్ట్స్ ఆథార్టీ ట్రయల్స్ కు హాజరు కావడం లేదని కన్ఫార్మ్ అవుతుంది. కొందరు నిపుణులు కూడా కంబాల క్రీడకే పరిమితం కావాలని సూచించినట్టు తెలిసింది.దీనిపై బెంగళూరు స్పోర్ట్స్ ఆథార్టీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందిస్తూ ట్రయల్స్ డేట్ కంటే ముందు వచ్చి కలవాల్సిందిగా కోరాం…అతను రావడానికి ట్రెయిన్ టిక్కెట్స్ కూడా బుక్ చేశాం…సోమవారం వస్తారనుకుంటున్నాం అని తెలిపారు. లేదంటే రెండు మూడు రోజుల్లోనైనా వస్తుండ వచ్చని భావిస్తున్నాం..ఇంకా ట్రయల్స్ డేట్ నిర్దారించలేదన్నారు. అన్ని క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించి వారిని మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతామని స్పోర్ట్స్ ఆథార్టీ ఆఫ్ ఇండియా అదికారులు తెలిపారు.
కంబాల అంటే ఏమిటి..?
కంబాల అనేది కర్ణాటకలో జరిగే వార్షిక క్రీడ. బురద పొలాల్లో బర్రెలను పరిగెత్తించుకుంటూ 142 మీటర్లను చేరుకోవడం. ఈ క్రీడలో బర్లను కొట్టుకుంటూ పరిగెత్తిస్తూ వాటిని కంట్రోల్ చేసుకుంటూ అత్యంత తక్కువ సమయంలో టార్గెట్ చేరుకోవాలి. దీనిలో తనతో పాటు బర్రెలను కూడా పరుగెత్తించాలి. దక్షిణ కర్ణాటకలోని తుళువ భూస్వామ్య కుటుంబంలో సాంప్రదాయంగా ఉన్న క్రీడ.
శ్రీనివాస గౌడ ప్రతిభపై కాంగ్రెస్ నేత శశి థరూర్, బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర కూడా స్పందిస్తూ అతనిని స్పార్ట్స్ ఆథార్టీ ఆఫ్ ఇండియా గుర్తించాలని మంత్రి కిరణ్ రిజిజుకు ట్వీట్ చేశారు.