ఆంధ్రప్రదేశ్ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందనే వార్త చర్చానీయాంశంగా మారాయి. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ కథనాన్ని మొదట ప్రచురించడంతో సంచలనంగా మారింది. కియా మోటార్స్ కంపెనీ ఏపీ నుంచి పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి తరలిపోతుందని దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు ప్రారంభమయ్యాయని సంస్థ తెలిపింది. ఏపీలో కంపెనీ నడపడానికి తమకు సమస్యలు ఎదురవుతున్నాయని..అందుకే తరలిపోవాలనే నిర్ణయించుకున్నట్టు తమిళనాడుకు చెందిన ఓ ఉన్నత స్థాయి అధికారి ఈ విషయాన్ని దృవీకరించినట్టు కూడా రాయిటర్స్ వెల్లడించింది. తమిళనాడులో కియా అనుబంధ సంస్థ అయిన హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్ ఉంది. హ్యుందాయ్ ద్వారా వారు తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ విషయంపై అటు తమిళనాడు ప్రభుత్వం గాని..ఏపీ ప్రభుత్వం గాని స్పందించలేదు.
కియా కంపెనీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏపీ లోని అనంతపురంలో ప్లాంట్ ను నెలకొల్పారు. పనులు కూడా ప్రారంభమై కార్లను మార్కెట్లోకి కూడా తీసుకొచ్చిది. అయితే ఆకస్మాత్తుగా కంపెనీని తరలివెళ్లడానికి కారణాలు వై.ఎస్ ప్రభుత్వ వైఖరే అని తెలుస్తోంది. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనతో పాటు గత ప్రభుత్వం కియాకు కల్పించిన రాయితీలపై ప్రోత్సకాలు (ఆర్ధిక ప్రోత్సకాలు, విద్యుత్ సంబంధ పన్నులు, భూముల కొనుగోళ్ల విషయం) జగన్ ప్రభుత్వం సమీక్ష చేయాలని భావించడమేనట.
తమిళనాడుకు ప్లాంట్‌ను తరలిస్తే లాజిస్టిక్ ఖర్చులు కూడా తగ్గుతాయని కియా కంపెనీ భావిస్తోందట. ప్లాంట్ తరలింపుపై ఇప్పటికిప్పుడే క్లారిటీ రాకపోయినా.. కియా ఎంత త్వరగా ఏపీ రాష్ట్రం నుంచి బటయకు వెళ్లాలని ఆలోచిస్తుందట. ప్లాంట్ తరలింపు చర్చలు రహస్యంగా జరుగుతున్నాయని తెలిసింది.
Advertisements
అయితే కియా కంపెనీ తరలింపు అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. కియా మాత్రమే కాదు ఏ కంపెనీ అయినా ఒక చోట నుంచి మరో చోటికి తరలించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మంటున్నారు నిపుణులు. రెండేళ్ల క్రితం అనంతపురంలో 12 వేల మంది ఉద్యోగులతో సంవత్సరానికి మూడు లక్షల యూనిట్ల ఉత్పత్తి టార్గెట్ గా భారీ పెట్టుబడితో నెలకొల్పిన ప్లాంట్ ను ఇప్పుడు ఎకాఎకిన తరలించడానికి ఎందుకు నిర్ణయం తీసుకుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కియా సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
రాయిటర్స్ లో వచ్చిన ఈ వార్తను టీడీపీ, జనసేన కార్యకర్తలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ కియా కంపెనీ వెళ్లిపోతుందంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే రాయిటర్స్ కథనంపై వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.