ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ అయింది. అలాగే ప్రస్తుతం ఓటిటి లో కూడా రిలీజ్ అయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే సముద్రఖని అజయ్ దేవగన్, శ్రేయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమాలో ఎన్నో హైలెట్ సీన్స్ ఉన్నప్పటికీ కొమరం భీముడో సాంగ్ మాత్రం అంతకుమించి అనేటట్లు నిలిచింది. ఈ పాటలో ఎన్టీఆర్ చూపించిన హావభావాలు అందరిని కట్టిపడేశాయి. పోరాట పటిమను ప్రజలలో కలిగించే విధంగా ఈ పాటని రాయించారు.
ఆచార్య లో చిరంజీవి పక్కన నటించిన ఘట్టమ్మ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా
అయితే ఈ పాట ఒరిజినల్ వేరే ఉందట. అప్పటి జానపద గీతానికి చెందిన ట్యూన్ ను పట్టుకొని పాదాలను మార్చేసి ఈ సాంగ్ రాసుకున్నారట. ఇదే విషయమై ఈ పాటను కాపీ చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. తెలంగాణ జానపద గీతం మదన సుందరి అనే పాటను మార్చి కొమురం భీముడో అంటూ రాశారట.
గతంలో ఆ పాటని గద్దర్ పాడారు. అలాగే రేలారే రేల షో లో కూడా పాడారు. అందుకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. ఈ పాట కు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా… కాలభైరవ పాడారు. గతంలో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించి రకరకాల ట్రోలింగ్ జరిగింది.
ఆర్ఆర్ఆర్ లో Jr. ఎన్టీఆర్ పట్టుకున్న జెండా చరిత్ర తెలుసా?
Advertisements