సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత ఘట్టమనేని కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయింది. ఇక ఆయన సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు కృష్ణతో తనకు ఉన్న జ్ఞాపకాలను ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. తాజాగా ఒక విషయం చెప్పారు ఆయన. తనకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నుంచి అన్నయ్యతో ఎన్నో జ్ఞాపకాలు ఏర్పడ్డాయని గుర్తు చేసుకున్నారు.
తన చిన్నప్పుడు అన్నయ్య సైకిల్ పై నన్ను తీసుకొని సినిమాకి వెళ్లేవారన్నారు. మద్రాసులో అన్నయ్యతో పాటు ఉంటూ చదువుకునే వాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. కృష్ణ అన్నయ్య తనకు బంగారం అనే పేరు కూడా పెట్టారని వెల్లడించారు. అన్నయ్యకు 70 సంవత్సరాల వయసు రాగానే కుటుంబ బాధ్యతలు అన్నింటిని నా చేతిలో పెట్టారని తెలిపారు. పిల్లలు కూడా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకున్న వారికి ఏది కావాలన్నా తనకు చెప్పి తన సలహాలు తన నిర్ణయాలు కూడా తీసుకునేవారన్నారు.
సినిమా ఇండస్ట్రీలో అన్నయ్య పడుతున్న కష్టం చూసే తాను సినిమాల్లోకి రాలేదన్నారు. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సినిమాని చేయాలని అన్నయ్య ఎంతో తపన పడ్డారని… ఆ సమయంలోనే దేవుడు చేసిన మనుషులు సినిమా చేశారని చెప్పుకొచ్చారు. అన్నయ్యకు వదినమ్మ ఇందిరా దేవి అంటే ఎంతో ఇష్టం అన్నారు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎవరికి తెలియదన్నారు. వదినమ్మ చనిపోయినప్పుడు అన్నయ్య చాలా ఎమోషనల్ అయ్యారని పేర్కొన్నారు.