సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా అలరించింది. అటు వసూళ్ళ పరంగా కూడా అక్కినేని ఫాన్స్ సంతోషంగానే ఉన్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, నాగార్జున పాత్రలు బాగా ఆకట్టుకోగా… నాగ చైతన్య, కృతి శెట్టి కూడా ప్రేక్షకులను అలరించారు. తమ పాత్రలకు ఇద్దరూ న్యాయం చేసారు.
Also Read: సర్కారు వారి కళావతి సాంగ్ ప్రోమో… కేక !!
2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. నాగార్జున బంగార్రాజుగా మంచి పాత్ర పోషించారు. ఇక ఆయన మనవడిగా… నాగ చైతన్యగా అద్భుతంగా నటించారు. కృతి శెట్టి కి ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది అని భావించాలి. అయితే ఈ సినిమాకు మరో హీరోయిన్ ను తీసుకోవాల్సి ఉంటుందట.
ఈ సినిమాకు గాను స్టార్ హీరోయిన్ రష్మిక మందనను సెలెక్ట్ చేయాల్సి ఉన్నా సరే చివరి నిమిషం లో ఆమెను పక్కన పెట్టారు. ఆమె రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడం తో పక్కన పెట్టింది చిత్ర యూనిట్. ఇక రష్మిక కూడా వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో ఆమె షూటింగ్ కు కూడా డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉండటం మరో కారణం. దీనితో కృతి శెట్టిని ఎంపిక చేసింది చిత్ర యూనిట్.
Also Read: మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్… ఈ సినిమాలో హీరో…!