నట సార్వభౌమ ఎన్టీఆర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదే పదే అన్నగారు అనుకుంటూ ఆయన ఎన్టీఆర్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తన గురువు దాసరి, తన అన్న ఎన్టీఆర్ అంటూ ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అయితే మోహన్ బాబు… ఎన్టీఆర్ కు కష్టాలు ఉన్న సమయంలో ఆయన పక్కన నిలబడే ప్రయత్నం చేయలేదు.
Also Read:అలియాభట్ పై సమంత ప్రశంసలు
వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమా అప్పట్లో ఒక సంచలనం. లక్షీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు ఈ సినిమాను స్వయంగా నిర్మించారు. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. 1994 లో ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా ఈ సినిమా హెల్ప్ అయింది. ఈ సినిమాకు ముందు మోహన్ బాబు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆయన మార్కెట్ కూడా పడిపోయింది.
అలాంటి టైం లో ఎన్టీఆర్ తో కలిసి నటించడమే కాకుండా మేజర్ చంద్రకాంత్ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ షూటింగ్ కు ముందు ఈ సినిమాకు పారితోషికం ఏం తీసుకోలేదు. సినిమా షూటింగ్ కు ముందు 25 లక్షలు తీసుకువెళ్లి మోహన్ బాబు ఇచ్చే ప్రయత్నం చేసినా సినిమా హిట్ కావాలని చెప్పారట. ఆ సినిమా సూపర్ హిట్ అయి మోహన్ బాబుని ఆర్ధిక కష్టాల నుంచి బయటకు లాగింది. తిరుపతి వేదికగా మోహన్ బాబు వంద రోజుల ఫంక్షన్ కూడా చేసారు. ఆ వేదికపైనే లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు.
రాజకీయాల్లోకి వచ్చే ముందు తన సంపాదన అంతా కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చేసారు ఎన్టీఆర్. దీనితో ఈ సినిమా ఫంక్షన్ లో పెళ్లి చేసుకున్నా కాబట్టి సినిమాకు రెమ్యునరేషన్ కావాలని మోహన్ బాబుని అడిగారట ఎన్టీఆర్. వెంటనే ఖాళీ చెక్ ను ఎన్టీఆర్ చేతిలో మోహన్ బాబు పెట్టడంతో ఆయన 50 లక్షలకు పైనే చెక్ లో రాసుకున్నారట. ఇది మోహన్ బాబుకి నచ్చలేదని అందుకే ఎన్టీఆర్ కు దూరమయ్యారని అంటారు. సిఎం గా ఎన్టీఆర్ ను దించినా… ఎంపీ గా ఉండి కూడా మోహన్ బాబు వెళ్ళలేదు.