మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌? - Tolivelugu

మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌?

 

వేల కోట్ల బిజినెస్‌తో దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించిన మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ కాబోతున్నారా…? ఐటీ సోదాల్లో అక్రమ లావాదేవీల అంశం బట్టబయలైందా…? ఈడీ కూడా అందుకే ఎంటరవుతోందా…?

రెండ్రోజుల సోదాల్లో… ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు, హర్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకోగా, ఇంకా వేల కోట్ల అంశాలపై మెఘా కృష్ణారెడ్డి నుండి సమాధానం రాబట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ కూడా సీన్లోకి ఎంటరై… దీనిపై నిజాలు నిగ్గు తేల్చే అవకాశం కనపడుతోంది. మనీలాండరింగ్ పై రవిప్రకాశ్‌ ఇచ్చిన కీలక డాక్యుమెంట్స్ వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆ ఆధారాలకు తోడు… సోదాలలో లభ్యమైన అంశాలను క్రోడీకరించిన తర్వాత… కేంద్ర సంస్థలు అవకతవకలు జరిగినట్లు నిర్దారించుకన్నట్లు తెలుస్తోంది. ఇక మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ తప్పకపోవచ్చని, మనీలాండరింగ్.. హవాలా అంశంలో ఆయన జైలుకు వెళ్లక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp