పుట్టగొడుగులు (మష్రూమ్) శాకాహారమా…? లేక మాంసా హారమా…? ఈ విషయం చాలా మందికి క్లారిటీ లేదు. కాని వీటికి మాత్రం క్రమంగా క్రేజ్ పెరుగుతుంది. చాలా వరకు కూడా భోజనాల్లో వీటికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సరేగాని అసలు వాటి సంగతి ఏంటీ…?
Also Read: సరోగసి ద్వారా బిడ్డలను కన్న ప్రముఖులు వీరే, పెళ్లి కాకుండానే తండ్రి…!
శాకాహారం అంటే వృక్షాల నుంచి వాటి భాగాల నుంచి లేదా మొక్కల నుంచి వాటి ఆకుల నుంచి వచ్చేది. అనంటే ఆకులు, అలములు, పండ్లు, కందమూలాలు ఇదంతా వెజ్. మరి ఆ విధంగా చూస్తే పుట్టగొడుగులు శాకాహారమా అంటే కాదనే చెప్పాలి. మరి మాంసాహారం అంటే… జంతువుల నుంచి వచ్చేది మాంసం. పుట్ట గొడుగులు ఏ జంతువుకి పుట్టవు కాబట్టి వాటిని ఆ కోణంలో చూడలేం. కాని వెజ్ మాత్రమే తినే వాళ్ళు దీన్ని నాన్ వెజ్ అంటున్నారు.
బయాలజీ పరంగా పుట్టగొడుగులు ఫంగస్ జాతికి చెందినవి అనేది శాస్త్రవేత్తల మాట. అవి ఒక రకమైన మైక్రో ఆర్గానిజమ్స్ గా చెప్తున్నారు. ఒకప్పుడు సహజంగా ఒక సీజన్ ప్రకారమే మాత్రమే వచ్చేవి. బ్రాహ్మణులు వాటిని శాకాహారంగా చూసే అవకాశం లేదు. కాని… ఇషా ఫౌండేషన్ వంటి వాటికి వెళ్తే మాత్రం అక్కడ మష్రూమ్ బిర్యాని బాగా ఫేమస్. ఇక అమెరికా లేదా చైనా వంటి దేశాల్లో ఏ వంట వండినా సరే వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనితో చాలా మంది బ్రాహ్మణులు అక్కడ జాగ్రత్త పడుతూ ఉంటారు.
Also Read: మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్… ఈ సినిమాలో హీరో…!