నాగశౌర్య హీరోగా వచ్చిన అశ్వద్ధామ సినిమా మంచి హిట్ సాధించింది. ఆయనే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా…నాగశౌర్య సరసన అందాల భామ మెహ్రీన్ నటించింది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను చూరగొనడంతో నాగశౌర్య ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన మరో మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమా పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా పెళ్లిచూపులు హీరోయిన్ రీతూ వర్మ యాక్ట్ చేయనుంది. అయితే ఉన్నట్టుండి ఈ సినిమా ఆగిపోయిందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది..
ఈ విషయమై అనేక రకాల ఊహాగానాలు వినిపించిన ప్రస్తుతం అందుతోన్న సమాచారం మేరకు..ఈ సినిమా డైరక్టర్, నిర్మాతలకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా మూవీ నిలిచిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలుసుకునేందుకు మరికొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే..