రాజధానిలో పవన్ భూములు కొన్నాడా...? పోగొట్టుకున్నాడా...? - Tolivelugu

రాజధానిలో పవన్ భూములు కొన్నాడా…? పోగొట్టుకున్నాడా…?

రాజధాని అమరావతి అని తెలియగానే జనసేన అధినేత పవన్ భూములు కొన్నాడని, దాదాపు 60 ఎకరాలని కొందరు, 82 ఎకరాలని కొందరు ఎవరికి వారు ప్రచారం చేశారు. కానీ నిజంగానే పవన్ రాజధాని అభివృద్దితో తన భూములకు విలువ పెంచుకున్నాడా…? లేదా సామాన్య రైతుల లాగే తాను రాజధాని కోసం భూములు త్యాగం చేశాడా….?

రాజకీయ నేతలు అభివృద్దిని ముందుగా పసిగట్టగలరు. పార్టీలకు అతీతంగా నేతలంతా రాజధాని అమరావతి ప్రాంతంలో భూములను కొనేందుకు పోటీపడ్డ వారే. అయితే… అమాయక పేద రైతులు… ప్రభుత్వం మీద నమ్మకంతో బాధతోనే తమకు అన్నంపెట్టే భూములను రాజధానికి ఇచ్చేశారు. ఇదే అదునుగా రాజకీయ నేతలు కొందరు బాగుపడ్డారు. అయితే అదే కోవలోకి జనసేన అధినేత పవన్ వస్తారని ప్రచారం సాగుతోంది.

అయితే… లాభపడే ఉద్దేశం ఉంటే పవన్‌ భూమి ఎందుకు సీర్డీయేకు ఇచ్చేశారు అన్నది అసలు ప్రశ్న. రాజధానికి ఆనుకొని భూములు కొని… రాబోయే రోజుల్లో అధిక లాభాలు తీసుకోవచ్చు. కానీ అందరూ సాదాసీదా రైతుల్లాగే పవన్ కూడా తన భూమిని ఇచ్చేశాడు. 2018లో పవన్‌ 90ఎకరాల భూమిని కొన్నాడు. అదే భూమిని 2019 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ సీఆర్డీయేకు ఇచ్చేశారు. అంటే పవన్‌ తన సొంత భూమిని సామాన్య రైతుల్లాగే ఇచ్చేసినట్లు స్పష్టంగా కనపడుతోంది. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన మాములు రైతు ఎంత లాభపడితే పవన్ కూడా అంతే లాభపడ్డట్లు కానీ అందరు రాజకీయ నాయకుల్లాగా ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఎక్కడుందని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

2018 ఏప్రిల్‌లో 10401/2012 లింక్ డాక్యుమెంట్‌ ద్వారా మంగళగిరిలో పాశం కోటిరెడ్డి నుండి పవన్ భూములు కొన్నారు. అక్కడ కొన్న భూములను 2567/2018 లింకు డాక్యుమెంట్ ద్వారా ఏపీ సీఆర్డీయేకు పవన్ తన భూములిచ్చారు. అంతేకాదు పవన్ భూములు కొన్నప్పుడు మార్కెట్ రేటు 2కోట్ల 40లక్షల 37వేల 860రూపాయలకు రిజిస్ట్రేషన్ చేయించారు. అదే సమయంలో పవన్‌ తన భూమిని కేవలం 21లక్షల 90వేలకే భూమిని అప్పజెప్పినట్లు రికార్డుల్లో ఉన్నాయి.

అంటే పవన్‌కు రాజధానిలో భూమి కొనడం ద్వారా జరిగిన మేలు కన్నా పోగొట్టుకున్నదే ఎక్కువగా కనపడుతోంది. పైగా అమరావతి రాజధాని అని ప్రకటించే సమయంలో టాలీవుడ్‌లోని ప్రముఖులంతా అక్కడ భూములు కొని తమ రేటును భారీగా పెంచుకోవటం విశేషం.

అయితే పవన్ అమరావతికి మద్దతివ్వడానికి, మూడు రాజధానులను వ్యతిరేకించడానికి రాజధాని పరిసర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ భారీగా భూములు కొన్నాడని వైసీపీ ఆరోపిస్తోంది. దాదాపు 60 ఎకరాలను మందడం గ్రామంలో పవన్‌కు భూములు, రాజులపాలెం, లింగాయపాలెంలలో 62 ఎకరాల భూములున్నట్లు వైసీపీ డాక్యుమెంట్లతో సహా ఆరోపిస్తోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp