డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్ లో విడుదలకాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే విజయ్ దేవరకొండ తో జన గణ మన అనౌన్స్ చేశాడు. ఈ సినిమా లైగర్ రిలీజ్ అయ్యే లోపు కంప్లీట్ అవుతుందని కూడా చెప్పుకొచ్చాడు.
అయితే తాజాగా ఈ కథ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే మోసపూరిత ముఖ్యమంత్రి ఇతర అధికారులు తమ పౌరులను ఇబ్బంది పెట్టడం ప్రారంభించినప్పుడు రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సైనిక అధికారి కథే జన గణ మనట.
మిలటరీకి అధికారాన్ని అప్పగించడం అంటే క్రమశిక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించటం లాంటిదని అలా చేస్తే సంపన్నమైన రాష్ట్రం ఏర్పడుతుందని పూరి ఆలోచనట. ఇక్కడి వరకు బాగానే ఉంది. అసలు పూరీ ఇప్పుడు ఏ రాష్ట్రం బ్యాక్‌డ్రాప్ లో కథను నడిపించబోతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పాన్-ఇండియన్ స్థాయిలో ఈ సినిమా చేయటానికి పూరి ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ముంబై నేపధ్యంలో ఉంటుందని కొంతమంది అనుకుంటుంటే తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో అయి ఉంటుందని మరి కొంత మంది అంటున్నారు. ఈ రెండింటిలో ఏ రాష్ట్రాన్ని ఎంచుకున్నా అది ప్రస్తుత పాలక వర్గానికి రాజకీయ వ్యంగ్యాస్త్రం కావడం ఖాయం.మరి చూడాలి ఏం జరుగుతుందో.
అంతే కాదు ఇందులో విజయ్ దేవరకొండ మిలిటరీ మేజర్ గా కనిపించబోతున్నాడట.