రామానాయుడు స్టూడియోస్. సినీ దిగ్గజ నిర్మాత రామానాయుడు పేరుతో స్థాపించిన స్టూడియో. కొన్ని వేల సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమా షూటింగ్‌లకు అవకాశం ఉండేది. కానీ ఇక ఆ అవకాశం నిర్మాతలకు ఉండదు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఉండటంతో ఆ ఏరియాలో భూమి చాలా ఖరీదు ఉంటుంది. దీంతో రామానాయుడు స్టూడియోస్‌ను రియల్ ఎస్టేట్ వెంచర్ చేయబోతున్నారు.
రామానాయుడు స్టూడియోస్‌ను మీనాక్షి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి డెవలప్‌మెంట్‌కు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్లాట్స్ నిర్మించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇదే రామానాయుడు స్టూడియోస్‌లో ఆఖరి సినిమా అనే ప్రచారం ఫిలింనగర్ సర్కిళ్స్‌లో చక్కర్లు కొడుతుంది.