ఏజ్ పెరుగుతున్న కొద్దీ హీరోయిన్లు ఫెయిడ్ ఔట్ అవుతుండడం కామన్. కానీ.. సమంత మాత్రం అంతకంతకూ తన ఇమేజ్ ను పెంచుకుంటూ పోతోంది. క్రేజ్ లోనే కాదు రెమ్యూనరేషన్ విషయంలోనూ యమ స్పీడ్ మీదుంది.
విడాకుల తర్వాత తరచూ ఏదో విషయంలో వార్తల్లో ఉంటూనే ఉంది సమంత. పుష్పలో ఐటమ్ సాంగ్ తర్వాత ఆమె క్రేజ్ ఇంకా పెరిగిందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే.. 12 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీని దున్నేస్తున్న సామ్.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఓటీటీలో విడుదలైన ది ఫ్యామిలీ మెన్ సిరీస్ ద్వారా నార్త్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది సమంత. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ.. ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది.
ఆమె నటించాలే గానీ.. అడ్వాన్స్ ఇచ్చేందుకు చాలామంది నిర్మాతలు ఎదురుచూస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. చాలా ఆఫర్లు సామ్ ముందు ఉన్నాయట. అయితే.. ఓ సినిమాకు ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి.. తాజా ప్రచారం అన్నా నిజం అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.