నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతా కాస్త హాట్ టాపిక్ అయింది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యక్తిగత జీవితం గురించి ఏదోక లీక్స్ ఇస్తూ వస్తుంది. ప్రస్తుతం తమిళ సినిమాలతో కూడా ఆమె బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక సమంతా ప్రస్తుతం విదేశాలకు వెళ్లి కొన్ని రోజులు ఉండే ఆలోచనలో ఉంది అంటున్నారు.
ఇక ఆమె నాగ చైతన్యతో మళ్ళీ కలిసే అవకాశం ఉందని, నాగార్జున అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒకటి కాస్త హాట్ టాపిక్ అయింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి సంబంధించిన వీడియో పై సోషల్ మీడియా జనాలు కూడా ఆసక్తిగా చూసారు. ఇదిలా ఉంటే డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయితో ఆమెకు గొడవ అయింది అంటున్నారు.
సమంతకు సినిమాల్లో వాయిస్ ఇచ్చే చిన్మయి ఇటీవలి కాలంలో ఆమెకు దూరంగా ఉంటుంది. హస్కీ వాయిస్ తో సమంతా కెరీర్ కు ఆమె బాగా హెల్ప్ అయింది. తమిళంలో సమంతాకు క్రేజ్ రావడానికి ఆ వాయిస్ ప్రధాన కారణం. చాలా మంది అది సమంతా సొంత గొంతు అనుకుంటారు. అయితే మహానటి సినిమా నుంచి సమంతాకు చిన్మయి దూరం పాటిస్తుంది. సమంతా సొంత డబ్బింగ్ చెప్పుకున్న సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. దీనితో ఆమె ప్రస్తుతం నటిస్తున్న యశోదా, శాకుంతలం సినిమాలకు చిన్మయితో డబ్బింగ్ చెప్పించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నా ఆమె మాత్రం నో అంటుంది. చిన్మయి లేకపోతే సమంతా కెరీర్ రిస్క్ లో ఉందనే కామెంట్స్ వినపడుతున్నాయి.